చాలామందికి ముఖం ఒక రంగులో కాళ్లు, చేతులు, శరీరం వేరొక రంగులో ఉంది అని బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా శీతాకాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే రేమిడి వీటికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిని ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీన్ని ఉపయోగించడం వలన మన చర్మం రంగు మారడంతో పాటు మంచి మాయిశ్చరైజర్ లాగా ఉంటుంది. ఇది పెడిక్యూర్ మేని క్యూర్ కన్నా చాలా బాగా పనిచేస్తుంది.
ఇందులో ఉపయోగించేవి అన్ని నేచురల్ ప్రొడక్ట్స్ కనుక హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక క్లీన్ బౌల్ తీసుకొని అందులో రెండు రూపాయల డావ్ షాంపూ ప్యాకెట్ వేసుకోవాలి. ఈ షాంపులో పీహెచ్ లెవెల్ తటస్థంగా ఉంటుంది. కనుక ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూన్ పంచదార కలుపుకోవాలి. పంచదార మన స్కిన్కు స్క్రబ్ లాగా పని చేస్తుంది. అంతేకాకుండా మన చర్మాన్ని ఎక్స్పోజ్ చేస్తుంది. తర్వాత ఒక స్పూన్ గ్లిజరిన్ కలుపుకోవాలి.
గ్లిజరిన్ మన చర్మం పొడిబారి పోకుండా చేస్తుంది. మెడికల్ షాప్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ మనం ఉపయోగించే ఏదైనా కాఫీ పౌడర్ వేసుకోవాలి. కాఫీ పౌడర్ మన చర్మానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఒక హాఫ్ నిమ్మచెక్క రసం పిండుకోవాలి. నిమ్మరసం చర్మం పై ఉన్న మురికిని తొలగించడంలో బాగా సహాయపడుతుంది. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మన చేతులకు మరియు కాళ్లకు అంతే కాకుండా శరీర భాగాలకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని మన శరీరం పై అప్లై చేసి పది నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత మనం రసం తీసుకోగా మిగిలిన నిమ్మచెక్కను ఉపయోగించి ఈ మిశ్రమం అప్లై చేసిన మొత్తం భాగం బాగా రబ్ చేయాలి. ఇలా ఐదు నిమిషాలు పాటు చేసిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పరిశీలిస్తే చాలా తేడా కనిపిస్తుంది. ఈ రెమెడీని ముఖానికి మాత్రం అప్లై చేయకూడదు. ఎందుకంటే ఇందులో షాంపూ ఉపయోగిస్తున్నాం. ఇలా నాలుగైదు సార్లు చేయడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి…