పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని మన జాబితాలో చేర్చుకోవడం చాలా ముఖ్యం. సమతుల్య ఆహారంలో ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పాలు వంటివి కచ్చితంగా ఉండాలి. కొలెస్ట్రాల్ తక్కువగా ఉండి, వైబర్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల మాన్ అజీర్ణ వ్యవస్థ పటిష్టంగా ఉండి మన జీవితకాలాన్ని పొడిగించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇలా ఫైబర్ ను సమృద్ధిగా కలిగి ఉన్న ఆహారపదార్థాలలో మొక్కజొన్న కూడా ఒకటి. చినుకులు పడుతున్నపుడు నిప్పులమీద చిటపటలాడి వేడివేడిగా మన చెంత చేరినా, కుతకుతలాడి కమ్మగా కనువిందు చేసినా, గారెలు, సలాడ్ లు అంటూ పసందును పంచినా మొక్కజొన్నకే చెల్లు. ఇన్నిరకాలుగా నోరు ఊరించే మొక్కజొన్నతో అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెల్సుకోవాలి తెలుసుకుంటే ఆహారంలో మిస్సవకుండా తీసుకుంటాం.
మొక్కజొన్న ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ధాన్యాలలో ఒకటి. ఈ ధాన్యంలో విటమిన్లు, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. సాధారణంగా అందరూ కాల్చుకుని తినడానికే మొగ్గు చూపుతారు. మొక్కజొన్న ఎరుపు, నలుపు, నీలం, గోధుమ వంటి రంగులలో లభిస్తుంది. అలాగే స్వీట్ కార్న్ పేరిట అందరిని ఆకర్షిస్తుంది. మొక్కజొన్న యొక్క ఆరోగ్య ప్రయోజనాలను చూడండి.
మొక్కజొన్న యొక్క ఆరోగ్య ప్రయోజనాలు
గొప్ప శక్తిని చేకూరుస్తుంది
బలహీనంగా ఉన్నవారికి శక్తి ఎక్కువ అవసరం. సాధారణంగా ఉన్నవారు కూడా ఎక్కువ ఆపని చేయగానే అలసిపోవడం పరిపాటి. అయితే మొక్కజొన్న సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది, ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయ అందువల్ల ఎక్కువ సేపు శక్తిని నిలిపి ఉంచుతాయి. సుమారు 100 గ్రాముల మొక్కజొన్న 21 గ్రాముల పిండి పదార్థాలను కలి.గి ఉంటుంది, ఇది శారీరక శక్తిని అందించడమే కాక మెదడు మరియు నాడీ వ్యవస్థ యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది.
ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుంది
ఐరన్ మరియు విటమిన్ బి 12 అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాల పెరుగుదల సమర్థవంతంగా ఉంటుంది. మొక్కజొన్నలో విటమిన్ బి 12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ పుషకాలంగా ఉంటాయి. ఇవి రక్తహీనత ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి, తాజా ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి అవసరమైన పోషకాలను మొక్కజొన్న చేకూరుస్తుంది.
రక్తంలో చక్కెర మరియు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది
మొక్కజొన్న నుండి 10 గ్రాముల రెసిస్టెంట్ స్టార్చ్ తీసుకోవడం వల్ల గ్లూకోజ్ మరియు ఇన్సులిన్ ప్రతిస్పందనలు గణనీయంగా తగ్గుతాయి. మొక్కజొన్న శరీరంలో నెమ్మదించిన రక్తప్రవహాన్ని వేగవంతం చేస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులలో చక్కెర స్థాయిలు క్రమంగా తగ్గుతాయి. అంతేకాదు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి సామర్త్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు టైప్ 2 డయాబెటిస్ వంటి వ్యాధులను అరికట్టవచ్చు.
కళ్ళకు ఆరోగ్యకరమైనది
మొక్కజొన్నలో కెరోటినాయిడ్లు ఉంటాయి – లుటిన్ మరియు జియాక్సంతిన్ ఇవి కంటి చూపుకు మంచివి. ఫ్రీ రాడికల్ కణాల వల్ల కలిగే నష్టాన్ని నివారించడానికి మొక్కజొన్న ఎంతగానో దోహదపడుతుంది.
బరువును నియంత్రిస్తుంది
ఇందులో మెండుగా ఉండే డైటరీ ఫైబర్ బరువు నియంత్రణలో సహాయపడుతుంది. దీర్ఘకాల చర్య ద్వారా జీర్ణమవడం వల్ల ఎక్కువసేపు కాదు నిండుగా ఉన్న భావన కలిగించి ఆకలిని దరికి చేరనివ్వకుండా ఉంటుంది. దీనివల్ల ఆహారాన్ని సాధారణంగానే తక్కువగా తీసుకోవడం మొదలుపెడతాము కాబట్టి బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
గ్లూటెన్ ఫ్రీ
మొక్కజొన్నలో సహజ పిండి పదార్థాలు ఉంటాయి. ఇది గ్లూటెన్ ఫ్రీ కాబట్టి జిగురు, బంక వంటి సమస్యలు ఉండవు. దీన్ని తీసుకోవడంలో ఎలాంటి సమస్య దరిచేరదు. కాబట్టి మొక్కజొన్న తీసుకోవడం సులువు.
చివరగా…..
అన్ని ధాన్యాలలోకి మొక్కజొన్న శ్రేష్ఠమైనది. దీన్ని పిండి పదార్థంగానూ వంటలలోకి మరియు ఉడికించి, కాల్చుకుని ఇలా బోలెడు రూపాల్లో తీసుకోవచ్చు.