హిందూ సాంప్రదయంలో నువ్వులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పెద్దలకు చేయించే పితృ కర్మలలో, ఆబ్దికాలలో నువ్వులను తప్పనిసరిగా వాడతారు. కేవలం ఇలాంటి సంప్రదాయాల కోసమే కాదు ఆరోగ్యం కోసం వాడితే నువ్వులతో వెలకట్టలేని ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతుంది. ఆయుర్వేదపరంగా నువ్వుల నుండి తీసే నూనె లేని వైద్యమంటూ ఉండదనేది వాస్తవం. ప్రపంచంలో ఆయుర్వేదానికి మూలమైన భారతదేశం నువ్వుల ఉత్పత్తిలో కూడా ప్రథమ స్థానంగా ఉంది. నువ్వులలో ఉన్న ఆరోగ్య రహస్యం ఏమిటో….. నువ్వుల ఉపయోగాలు ఏమిటో ఒక్కసారి చూద్దాం.
◆నువ్వులు సాధారణంగా అందరికి తెలుపు మరియు నలుపు రంగులలో లభ్యమవుతాయి. నువ్వులు వగరు మరియు తీపి రుచులు కలిగి ఉంటాయి. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఒమేగా-3, ఒమేగా-6, ఒమేగా-9 ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి. మరి నువ్వుల ఉపయోగాలు ఏంటో ఒకసారి చూద్దాం.
◆సాధారణంగా వయసులో ఉన్న ఆడపిల్లలకు పెట్టె పోషకపదార్థంలో నువ్వులు తప్పని సరిగా ఉంటాయి. వీటిలో కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల ఆడపిల్లలకు మంచి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. నువ్వులు, బెల్లం దంచి చిమ్మిలి చేసి పెట్టడం వల్ల ఆడపిల్లలో నెలసరి ద్వారా పోయే రక్తానికి సరిపడు కొత్త రక్తకణాలను మరియు హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో తోడ్పడతాయి.

◆నువ్వులలో జింక్ సమృద్ధిగా ఉంటుంది అందుకే నువ్వులు తీసుకుంటే ఎదిగే పిల్లల శరీరం లో ఎముకల ఎదుగుదల ఆరోగ్యకరంగా ఉంటుంది.
◆మహిళలు కూడా ప్రతిరోజు నువ్వులు బెల్లం కలిపి తయారు చేసిన నువ్వుల ఉండలు తీసుకోవడం వల్ల శారీరకంగా దృడంగా ఉండగలుగుతారు.
◆అద్భుతమైన ఒక చిన్న ప్రయోగం. ప్రతిరోజు ఉదయాన్నే స్పూన్ నువ్వులను నోట్లో వేసుకుని నమిలి తినడం వల్ల ఎలాంటి జబ్బులు రాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉండవచ్చు.
◆నువ్వులలో లభించే ఒమేగా ఆమ్లాల వల్ల నువ్వులను తీసుకునే వారిలో జుట్టు పెరుగుదల వేగంగానూ మరియు వొత్తుగానూ ఉంటుంది.
◆నువ్వుల నుండి తీసిన స్వచ్ఛమైన గానుగ నూనెను వంటల్లో ఉపయోగించడం వల్ల ఎన్నో రకాల జబ్బులకు చెక్ పెట్టవచ్చు.

◆నువ్వుల నూనెను ప్రతిరోజు శరీరానికి మర్దనా చేసుకుని కొన్ని నిమిషాలు ఎండలో ఉండి తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరం లో అవయవాలు దృఢంగా తయారవడమే కాకుండా చర్మ సంబంధ వ్యాధులు ఏమైనా ఉంటే నివారించబడతాయి.
◆నువ్వులను రోజువారీ వంటల్లో భాగం చేయడం వల్ల మంచి ఆరోగ్యం సొంతమవుతుంది.
◆నువ్వుల గూర్చి ఇన్ని ఉపయోగాలు ఉన్నా నేరుగా ఎక్కువ తీసుకుంటే పైత్యం చేస్తుంది. కాబట్టి నువ్వులను దోరగా వేయించి వాడటం వల్ల ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చు.
చివరగా…
వంటింట్లో వండర్ లాగా నువ్వులతో పచ్చళ్ళు, పొడులు, పులిహోరా వంటి అద్భుతమైన పదార్థాలను వండి ఆహార మెనూ లో ఉంచితే ఆరోగ్యాన్ని మన ముందు విస్తరలో పరుచుకున్నట్టే. లాగించేయడం,ఆస్వాదించడం, ఆరోగ్యాన్ని పొందడం. బాధలేని, నొప్పిలేని పద్దతిలో రుచుల విందుతో చక్కని ఆరోగ్యం నువ్వులతో ఆనందాల వానను పొందండి