10-best-throat-pain-remedies

గృహవైద్యంతో గొంతునొప్పి మాయం…

గొంతునొప్పి రావడం సహజమే.. డాక్టర్ కి చూపించడమో.. లేక మందులు కొని వేసుకోవడమో చేస్తుంటాము. అయితే.. సీజన్ మారగానే వచ్చే గొంతునొప్పుల్ని అశ్రద్ధ చేయకూడదు.  ప్రతిసారి.. గొంతు నొప్పికి డాక్టర్ చుట్టూ తిరగకుండా.. గొంతునొప్పిని మాయం చేసే కొన్ని గృహవైధ్యాలు తెలుసుకుందాం..

  • గొంతునొప్పికి సహజ వైద్యం.. గోరువెచ్చని నీరు తాగడం..  దీంతో పాటుగా.. హెర్బల్ టీ, తాజా కూరలతో చేసిన సూప్ లు ఎక్కవగా  సేవించాలి. ఇలాంటి ద్రవ్యాలు సేవించడం వలన, అధికంగా ఏర్పడే ఆమము బయటకు వెళ్ళిపోతుంది.
  • వేడి చేసిన నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనే కలిపి సేవించినా గొంతులో ఉపశమనం లబిస్తుంది.
  • ఇక.. ఈ చిట్కా మీ అందరికి తెలిసినదే, అయితే, దీన్నిఎవ్వరూ ఆచరించారు..  ఉప్పునీటితో గార్గ్లింగ్… అంటే.. నోరు పుక్కిలించడం. ఇలా రోజుకి రెండు సార్లు చేసినా అద్భుతంగా పనిచేస్తుంది.
  • పొద్దున్న లేవగానే.. ఒక స్పూన్ తాజాగా చేసుకున్న అల్లము రసంలో, తేనే ఒక స్పూన్ కలిపి ఈ మిశ్రమాన్ని సేవిస్తే.. గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.. గొంతు బుంగర తగ్గి ఉపశమనం చేకూరుతుంది.
  • ప్రకృతి ఔషధాలలో వెల్లుల్లి కూడా ఒకటి. పరగడపునే పచ్చి వెల్లుల్లిని దంచి తినాలి.. ఇలా తినలేని వారు.. కొద్దిగా ఉడకబెట్టి కూడా తీసుకోవచ్చు.. లేదంటే.. కూరల్లో లేక రసంలో కూడా కలిపి వండుకొని తీసుకొంటే.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.
  • తులసి రసం రోజుకి రెండు మూడు సార్లు ఒక చంచాడు తీసుకుంటే కూడా మంచి లాభం చేకూరుతుంది.
  • ఆమము కలుగచేసే పాలు, చల్లని పరుగు నిషేదించడం మంచిది. కారము పదార్ధాలు.. బిస్కెట్స్, చాక్లెట్స్, పూర్తిగా మానెయ్యాలి. గొంతునొప్పి ఉండగా ఇవి తింటే.. మరింత వ్యాధిని పెంచుతాయని గ్రహించాలి.
  • ఇక మగవాళ్ళు మద్యం, ధూమపానం, కాఫీలకు దూరంగా ఉంటే ఎంతో ఆరోగ్యకరం. ఊపిరితిత్తులకి ఈ సమయంలో కొంత విశ్రాంతి అవసరం.. కాబట్టి వీటికి దూరంగా ఉండండి.
  • ఇక చివరగా ఎంత తక్కువగా మాట్లాడితే అంత త్వరగా గొంతునొప్పి నుండి కోలుకంటారు. ఎక్కువగా అరవకుండా.. నెమ్మదిగా మాట్లాడటం, గొంతుకు కావలసినంత విశ్రాంతి ఇస్తే.. కేవలం కొద్ది రోజుల్లోనే గొంతునొప్పిని మాయం చేసుకోవచ్చు.
  • వీటన్నిటితో పాటుగా.. విటమిన్ సి నిండి ఉండే పండ్లను కూడా తింటే.. ఇమ్మ్యూనిటీ పెరిగి.. ఇలాంటి ఇబ్బందులను.. తక్కువగా ఎదురుకుంటారు.

Leave a Comment

error: Content is protected !!