10 Health Benefits of Pumpkin

గుమ్మడి కాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మన శరీరం కోటానుకోట్ల కణాల సముదాయం.  కణం అంటే కంటికి కనిపించనంత  చిన్నగా మైక్రోస్కోప్ లో మాత్రమే కనిపిస్తుంది. కోట్ల   కణాలు ఒకదాని పక్కన 1  చేరి సముదాయంగా  ఏర్పడితే ఒక అవయవం ఏర్పడుతుంది. అవయవాలు ఒకదాని పక్కన ఒకటి చేరితే శరీరం  ఏర్పాటు అవుతుంది. శరీరం మొత్తం కోటను కోట్ల సముదాయం.ఒక కణం నుండి శరీరం మొత్తం ఏర్పడుతుంది. ఒక కణం నుండి విభజన జరిగి జీవం ఏర్పడుతుంది. తల్లి అండం యొక్క కణంతో,వీర్య కణంతో కలిసి పిండం ఏర్పడుతుంది.

ఆ ఒక కణం లోపల నూక్లియస్, లోపల DNA ఉంటాయి. ఆ డిఎన్ఏ డామేజ్ అవకుండా రక్షించడానికి తీపి గుమ్మడికాయ చాలా బాగా ఉపయోగపడుతుంది.డిఎన్ఏ డామేజ్ అవ్వడానికి కారణం ఆక్సిడేటివ్ స్ట్రెస్స్. శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్స్ తగ్గితే డిఎన్ఏ డామేజ్ కూడా తగ్గుతుంది.తీపి గుమ్మడికాయలో ఉండే బీటాక్రిప్టోగ్జాన్తిన్ అలాగే జోయోగ్జాంథిన్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి శరీరాన్ని రక్షించి  డిఎన్ఏ డ్యామేజ్ అవకుండా రక్షిస్తాయి.  ఆక్సీకరణం వలన కణాలు  డామేజ్ అవుతాయి.  

ఆక్సిడేటివ్ స్ట్రెస్కు గురవకుండా  ఉండడానికి డిఎన్ఏ డామేజ్ అవ్వకుండా హెల్తీ గా తయారవడానికి తీపి గుమ్మడికాయ చాలా బాగా సహాయపడుతుంది.  గుమ్మడికాయ సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది పాడవదు.ఇండియాలోనే 2010వ  సంవత్సరంలో జియాజి యూనివర్సిటీ గుమ్మడికాయ మీద పరిశోధనలు జరిపింది.  గుమ్మడి కాయ వాతం చేస్తుందని లేకపోతే  షుగర్ పెరుగుతుందని లేక వేడి చేస్తుందని గుమ్మడి కాయ తినడం మానేస్తారు.  బరువు పెరుగుతారు ఏమో అని భయంతో కొంతమంది తినడం మానేస్తారు.  గుమ్మడి కాయ పులుసులో పులుపు  వేయడం వల్ల  ఉప్పు ఎక్కువ పడుతుంది. 

ఉప్పు వల్ల వచ్చే  నొప్పులను గుర్తించలేక వాతం  అని అనుకుంటాము. ఒళ్ళు నొప్పులు రావడం, వేడి చేయడం, ఒళ్ళు పట్టడం వంటివి జరుగుతాయి. ఇవన్నీ ఉప్పు వలన  వస్తాయి. గుమ్మడికాయ వల్ల కాదు.తీపి గుమ్మడికాయ వండే విధానంలో కూడా తేడా ఉంటుంది.  గుమ్మడి కాయ వండే టప్పుడు కొంచెం కొబ్బరిపాలు వేసుకుని వండితే  చాలా బాగుంటుంది. మసాలా ఇగురు వేసుకున్న బాగుంటుంది.  నూనె బాగా వేడెక్కిన తర్వాత  వండటం వలన గుమ్మడికాయ వలన వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు తగ్గిపోతాయి. 

అలా కాకుండా నూనెలు తక్కువగా వేడి  చేయడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. గుమ్మడికాయ తినడం వలన డిఎన్ఏ డామేజ్ అవ్వకుండా రక్షించబడుతుంది. గుమ్మడి కాయ వల్ల ఆరోగ్య కలిగే ఆరోగ్య ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని గుమ్మడికాయని ఎక్కువగా తీసుకోవడం మంచిది.

Leave a Comment

error: Content is protected !!