రోజ్ యాపిల్స్ లేదా వాటర్ యాపిల్స్ గా పిలిచే జంబు ఫలంలో డయాబెటిస్‌ను నియంత్రించడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, శరీరంలో టాక్సిన్ లను తగ్గించడం, గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం మరియు రోగనిరోధక శక్తిని పెంచడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాస్తవానికి, ఇవి జామపళ్ల జాతికి చెందినవి., సాధారణంగా తినే రకానికి సైజిజియం జాంబోస్ అనే శాస్త్రీయ నామం ఉంది. మొక్క యొక్క పండు, బెరడు మరియు ఆకులు అనేక ఔషధ లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిని జానపద వైద్యాలలో కూడా విరివిగా ఉపయోగిస్తారు.
జంబు ఫలంలో విటమిన్ ఎ మరియు సి అధికంగా ఉంటాయి అలాగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ప్రోటీన్, కాల్షియం, థయామిన్, నియాసిన్, ఐరన్, సల్ఫర్ మరియు పొటాషియం కూడా ఉంటాయి. సేంద్రీయ మొక్కల సమ్మేళనాల పరంగా, వాటిలో జాంబోసిన్, బెటులినిక్ ఆమ్లం మరియు ఫ్రైడెలోలాక్టోన్ ఉంటాయి.
జంబు ఫలం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు:
డయాబెటిస్‌ను నియంత్రించవచ్చు:
జాంబోసిన్ అనేది జంబు ఫలంలో కనిపించే ఒక రకమైన ఆల్కలాయిడ్, ఇది పిండి పదార్ధాన్ని చక్కెరగా మార్చడాన్ని నియంత్రించడంలో మంచి ఫలితాలను ఇస్తుంది. డయాబెటిస్‌తో బాధపడేవారు మరియు డయాబెటిస్ వచ్చే సూచనలు ఉన్నవారు జంబు ఫలాన్ని తీసుకోవడం వల్ల గొప్ప పలితాన్ని పొందవచ్చు. సాంప్రదాయకంగా జానపద ఔషధం లో, కాల్చిన విత్తన పొడి కషాయం డయాబెటిస్‌కు వ్యతిరేకంగా ఉపయోగపడుతుంది.
జీర్ణక్రియకు గొప్పగా దోహాధం చేస్తుంది:
జంబు ఫలం అధిక శాతం నీటితో ఉంటుంది. అలాగే ఇందులో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను పటిష్టం చేస్తుంది. అలాగే మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. సాంప్రదాయ ఔషధం లో, విరేచనాలు మరియు ఉదర సంబంధ సమస్యలను నివారించడానికి ఈ పండు యొక్క విత్తనాలను ఉపయోగిస్తారు.
గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది:
జంబు ఫలంలోని పోషకాలలో తక్కువ సోడియం మరియు పొటాషియం, నీరు మరియు ఇతర ప్రయోజనకరమైన సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. రక్తపోటును తగ్గించడంలో సానుకూల ప్రభావాలను కలిగి ఉంటాయి. రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించడం మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడటం అలాగే అథెరోస్క్లెరోసిస్ ప్రమాదాన్ని తక్కువ చేస్తుంది, తద్వారా గుండెపోటు, స్ట్రోకులు మరియు కొరోనరీ హార్ట్ డిసీజెస్ వంటి హృదయనాళ సమస్యలను నివారించవచ్చు.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
జంబు ఫలంలో క్రియాశీల మరియు అస్థిర భాగాలు యాంటీమైక్రోబయల్ మరియు యాంటీ ఫంగల్ ప్రభావాలతో ముడిపడి ఉన్నాయి. ఈ యాంటీమైక్రోబయల్ మరియు యాంటీ ఫంగల్ ఎఫెక్ట్స్ చర్మాన్ని వివిధ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి మరియు అనారోగ్యం మరియు అంటు వ్యాధుల నుండి ఆరోగ్యాన్ని కాపాడటానికి తగిన రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
చివరగా…….
మూర్ఛ, మశూచి, కీళ్ళలో మంట, వడలిపోయిన కళ్ళు మరియు అభిజ్ఞా సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడటం వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా జంబు ఫలం అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఇది దొరికిన వారు తప్పక ఆహారంలో భాగం చేసుకోవడం మరవకండి.