10 health benefits of tea and some options for delicious teas

ఉత్తేజాన్ని ఇచ్చి దగ్గు, కఫం, గొంతు గరగర చిటికెలో మాయం

చలికాలంలో ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే గొంతులో గరగర, నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటికి టీవీలో చూపించే అనేక రకాల కెమికల్స్తో తయారు చేసిన టాబ్లెట్ వాడటం వలన శరీరంలో విష పదార్ధాలు ఎక్కువగా పేరుకుంటాయి. అలా కాకుండా నాచురల్ గా ఎలా గొంతు గరగర, నొప్పి, చాతిలో పేరుకుపోయిన కోపం వంటివి తొలగించుకోవడానికి మనం ఇంట్లోనే ఒక మంచి హెల్త్ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. దీని కోసం ఉపయోగించే పదార్థాలు అనేక ఆయుర్వేద గుణాలను కలిగి ఉండి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 స్టవ్పై ఒక రెండు గ్లాసుల నీటిని పెట్టుకొని అందులో ఒక ఇంచు అల్లం ముక్కను బాగా తురిమి వేసుకోండి. అల్లం యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలతో నిండి ఉంటుంది. ఇది గొంతులో ఏర్పడిన ఇన్ఫెక్షన్ తగ్గించి నొప్పి, గరగర వంటి సమస్యలను నివారిస్తుంది. తర్వాత పదార్థం మిరియాల పొడి. ఒక పావు స్పూను మిరియాల పొడి కూడా వేసుకోండి. ఒకప్పుడు చలికాలం వచ్చిందంటే మిరియాలపొడిని ఆహారంలో భాగంగా ఎక్కువగా తీసుకుంటూ ఉండేవారు. ఇది శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కఫం సమస్యను తగ్గించి శ్వాస నాళాలను శుభ్రపరస్తుంది. తర్వాత ఒక 10 లేదా 15 తులసి ఆకులను అంతే మొత్తంలో పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి. 

ఈ నీటిని సగం అయ్యేంతవరకు మరిగించి నీటిని వడకట్టి రెండు లేదా మూడు స్పూన్ల తేనె  వేసుకోవాలి. ప్రతి రోజు ఉదయం ఇలా టీని తాగడం వలన మూడు రోజుల్లో గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ఇందులో వాడిన తులసి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలపరచడంతోపాటు గొంతు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. తలనొప్పి వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. పుదీనా మంచి సువాసనతో పాటు కండరాల సడలింపుకు సహాయపడుతుంది. ఈ టీ చలికి బిగుసుకున్న కండరాలు సడలించి శరీరంలో అనేక రకాల నొప్పులు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

మీరు కావాలనుకుంటే మంచి వాసన కోసం యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. ఈ టీలో అల్లం, మిరియాల పొడి ముఖ్యమైన పదార్థాలు. ఇవి శరీరంలో పేరుకున్న వ్యర్థపదార్థాలను బయటకు పంపడంలో కూడా సహాయపడతాయి. గ్యాస్ట్రిక్ సమస్యను నివారిస్తాయి. ఉదయాన్నే ఉండే వికారం వంటి సమస్యలు తగ్గడం లో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అంతే కాకుండా బరువు తగ్గాలనుకునే వారికి శరీరంలో కొవ్వును కరిగించి బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.

Leave a Comment

error: Content is protected !!