10 home hacks when it comes to hair growth

రోజుకి ఒకటి తినండి చాలు, జుట్టు వద్దన్నా పెరుగుతుంది, 15 రోజుల్లో తేడా చూస్తారు

ఈ మధ్య కాలంలో జుట్టు రాలడం సమస్య సర్వసాధారణమైపోయింది. జుట్టు రాలడానికి అనేక  కారణాలు ఉన్నాయి. కాలుష్యం, ఆహారంలో పోషకాలు లోపించడం వంటివి ప్రధాన కారణాలు.  జుట్టు పెరగడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల  ఆయిల్, హెయిర్ ప్యాక్స్ ట్రై చేస్తూ ఉంటాం. కానీ వాటిని  ఉపయోగించడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. వీటిలో  అనేక రకాల కెమికల్స్ కలిగి ఉండడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇటువంటి వాటిని  ఉపయోగించకుండా కేవలం రోజుకు ఒకటి తీసుకున్నట్లయితే జుట్టు రాలడం తగ్గించుకోవచ్చు. 

      వీటిని ప్రతిరోజు రోజుకు ఒకటి  తినడం వల్ల జుట్టుకు కావలసిన పోషకాలు లభిస్తాయి. జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. దీని  కోసం ఒక కప్పు బాదం పప్పు, ఒక కప్పు వాల్నట్స్, ఒక కప్పు నువ్వులు, ఒక కప్పు ఖర్జూరం, ఒక కప్పు అవిసె గింజలను తీసుకోవాలి.   బాదం తీసుకోవడం వల్ల జుట్టుకు కావలసిన పోషకాలు లభిస్తాయి. అలాగే అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ  వంటివి ఉంటాయి. నువ్వులు కాల్షియం ఐరన్ మెగ్నీషియం వంటివి పుష్కలంగా కలిగి ఉంటాయి. 

     ఖర్జూరం ఐరన్ మెగ్నీషియం కాల్షియం వంటి పోషకాలు కలిగి ఉంటాయి. వాల్నట్స్ జుట్టుకు కావల్సిన ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అన్ని రకాల విటమిన్లు కలిగి ఉంటాయి.  వీటన్నిటినీ కలిపి డ్రై పాన్ లో  దోరగా వేయించుకోవాలి. ఖర్జూరాన్ని మాత్రం కొంచెం నెయ్యి వేసి వేయించుకోవాలి.    100 గ్రాముల బెల్లం కూడా వేసుకోవాలి. వీటన్నిటిని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత నీటిని కలిపి మిక్సి జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.  తర్వాత వీటిని ఉండలుగా చుట్టుకోవడానికి  అవసరమైతే కొంచెం నెయ్యి వేసుకోవాలి. 

       వీటన్నిటిలో  ఆయిల్స్ ఉంటాయి కాబట్టి నెయ్యి ఎక్కువగా అవసరం ఉండదు. ఈ పొడిని పెద్ద నిమ్మకాయ సైజులో ఉండలుగా చేసుకోవాలి. ఈ  డ్రై ఫ్రూట్ లడ్డుని ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఒకటి చొప్పున తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఈ లడ్డూలను తీసుకోవడం వల్ల జుట్టుకు అవసరమైన పోషకాలు లభిస్తాయి.ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టుకు కావాల్సిన పోషకాలు అందించడం వలన జుట్టు రాలడం తగ్గుతుంది. 

       హాస్టల్స్ లో ఉండే వాళ్ళు హెయిర్ ఆయిల్స్, హెయిర్ ప్యాక్స్ తయారుచేసుకుని ఉపయోగించలేరు.  కాబట్టి వీటిని ఇంటి నుండి వెళ్ళేటపుడు తయారుచేసుకుని తీసుకెళ్తే బాగా ఉపయోగపడతాయి.   ఇది జుట్టు రాలడం తగ్గించడమే కాకుండా గుండెకు సంబంధించిన సమస్యలు తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.

Leave a Comment

error: Content is protected !!