ఉల్లిపాయ ప్రతి ఇంట్లో వంటగదిలో తప్పనిసరిగా ఉంటుంది. సాధారణంగా మనం ఉల్లిబయను పొట్టు తీసి నచ్చినట్టు కట్ చేసుకుని వంటల్లో వాడతాం. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఉల్లిపాయ మనం తింటున్న విధం కంటే మనం చెత్త బుట్టలోకి తోసేస్తున్న ఉల్లిపాయ తొక్కలోనే అద్భుతమైన పోషకాలు ఉన్నాయని.
ఈ విషయం వినగానే ఉల్లి తొక్కలో పోషకాలు ఏంటి?? వాటిని ఇప్పుడు తినమని చెబుతున్నారా అనే సందేహం మీకు కలగవచ్చు. ఉల్లిపాయ తొక్కలలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ ఎ, సి, ఇ మరియు గుండెకు అనుకూలమైన ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి మరియు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి ఉల్లిపాయ తొక్కలు ఎంతగానో దోహాధం చేస్తాయి.
మరి ఇన్ని పోషకాలు ఉన్న ఉల్లిపాయ తొక్కలను ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం.
సూప్ మరియు కూరలు ఉడుకుతున్నపుడు వాటిలో జోడించడం.
సూప్, స మరియు కూరలు ఉడుకుతున్నపుడు ఉల్లిపాయ తొక్కలను వాటిలో వేయాలి. ఇది సూప్ లేదా కూరలు చిక్కగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా కూరలకు మంచి రంగు వచ్చేలా చేస్తుంది కూడా. కొంత సమయం ఉడకబెట్టిన తర్వాత పొట్టును బయటకు తీసేయాలి.
ఆహారపదార్థాలపై చల్లుకోవడం
ఇదేంటి పిచ్చిగా చెబుతున్నారు అనుకోకండి. ఉల్లిపాయ తొక్కలను ముదురు రంగులో వచ్చేవరకు వాటిని వేయించి తరువాత పొడిగా చేసుకుని నిల్వచేసుకోవాలి. ఇది చాలా మంచి వాసన కలిగి ఉంటుంది. ఈ పొడిని ఆహారపదార్థాలపై చాట్ మసాలా, మిరియాల పొడిలాగా ఉల్లిపాయ పొడిని చల్లుకోవడం వల్ల మంచి సువాసన మరియు గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు కూడా.
ఉల్లి తొక్కల టీ
ఎప్పుడూ వినని మరొక చిట్కా. ఉల్లి తొక్కల టీ. ఇది మనస్సును ప్రశాంతపరుస్తుంది మరియు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. టీ బ్యాగ్ / గ్రీన్ టీ ఆకులు మరియు ఉల్లిపాయ తొక్కలు ఉన్న కప్పులో వేడినీరు పోయాలి మరియు కొంత సమయం పాటు రెండింటినీ బాగా కలపాలి. టీని వడకట్టి తాగేయడమే. ఇదెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది.
ఉల్లిపాయ తొక్క నానబెట్టిన నీరు
ఉల్లిపాయ తొక్క నానబెట్టిన నీరు శోథ నిరోధక లక్షణాలను అందిస్తుంది మరియు దీర్ఘకాలిక కండరాల తిమ్మిరిని తగ్గిస్తుంది. ఒక గ్లాసు నీటిలో ఉల్లిపాయ తొక్కలను వేసి కనీసం 15 నిమిషాలు నానబెట్టండి. తొక్కలను తీసివేసి, ఆ నీటిని తాగాలి. గొప్ప ఫలితం ఉంటుంది.
బియ్యం ఎక్కువ రుచిని జోడించండి
బిర్యానీ, పులావ్, ఫ్రైడ్ రైస్, జీరా రైస్ – దాదాపు అన్ని బియ్యం వంటలలో ఉల్లిపాయ తొక్కలతో పాటు వండటం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అయితే వండిన తరువాత ఆ తొక్కలను తీసివేయడం మరిచిపోకండి.
చివరగా…..
ఉల్లిపాయ తొక్క గూర్చి, వాటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గూర్చి తెలుసుకున్నాక ఇప్పుడొక ముఖ్య విషయం. ఉల్లిపాయ తొక్కను ఉపయోగించుకోదలిస్తే సేంద్రియ పద్దతిలో, రసాయన, కృత్రిమ ఎరువులు వాడకుండా పండిన ఉల్లిపాయలు మాత్రమే ఉపయోగించుకోవడం మరవకండి.