10 Natural Remedies For Swollen Feet And Ankles

మీ కాళ్ళు,చేతుల్లో వచ్చే నీరు,వాపులను తగ్గించే అధ్భుతమైన ఆయుర్వేద చిట్కా వైద్యం..swelling remedies

అప్పుడప్పుడు శరీరంలో వాపులు వస్తే ఏమైనా సమస్యేమోనని భయపడుతుంటాం. ఇలా వాపులు రావడాన్ని ఎడీమా అంటారు.  ఇది పెద్ద సమస్య కాదుకానీ చిన్నగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేస్తే పెద్ద విషయంగా పరిణమిస్తుంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్య నుండి బయట పడొచ్చు. శరీరంలో వాపులు రావడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు శరీరంలో సోడియం లెవల్స్ ఎక్కువయితే అప్పుడు శరీరభాగాల్లో వాపులు అనేవి వస్తాయి. అలాగే నీటిని తక్కువ తీసుకోవడం. మనం ఉప్పు ఎక్కువ తీసుకోవడం వలన శరీరంలో సోడియం పెరిగిపోతుంది. నీరు తక్కువగా తీసుకోవడం వలన మూత్రం కూడా ఎక్కువగా రాదు. దానివలన సోడియం పేరుకుపోయి వాపులకు,నొప్పులకు కారణమవుతుంది. అందుకే ఎటువంటి అనారోగ్యాలు లేకపోయినా సరే ఇలా వాపులు కనిపిస్తాయి. అందుకే తగినంత ఉప్పు మాత్రమే తీసుకోవాలి. పదకొండు సంవత్సరాలు పైబడిన ఎవరికైనా సరే ఐదుగ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు. అలాతీసుకుంటే రక్తపోటు తో పాటు ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి.

 అలా ఎక్కువ రోజులు కొనసాగితే గుండెసమస్యలు ముఖ్యంగా గుండెపోటు, కిడ్నీ వ్యాధులు వస్తాయి. పొట్టలో గ్యాస్, మలబద్దకం, ఎసిడిటీ, రక్తహీనత లాంటి సమస్యలు వస్తాయి. ఉప్పు తగ్గించి నీరు ఎక్కువగా తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. గుండె సంబంధ వ్యాధులకు చేతుల్లోనూ, లివర్ వ్యాధులకు పొట్ట ప్రాంతంలోనూ వాపులు వస్తాయి. కిడ్నీ వ్యాధులకు ముఖం, కాళ్ళలోనూ వాపులు వస్తాయి. ఊపిరి తిత్తుల్లో నీటి నిల్వలు పెరిగితే శరీరం మొత్తం వాచిపోతుంది. రోజంతా ఒకచోట కుర్చుని లేదా నిలబడి పనిచేసే వారిలో ఈ వాపులు కనిపిస్తాయి. వీరు కొంతసమయం లేచి నడవడం లేదా కూర్చొవడం వలన రక్తప్రసరణ మెరుగుపడి వాపులు తగ్గుతాయి. గర్బవతుల్లో కూడా వాపులు ఎక్కువ కనిపిస్తాయీ. సరైన సమయానికి తినకపోయినా, సర్జరీలు జరిగినా ఇలా వాపులు ఉంటాయి. ఈ వాపులు తగ్గడానికి  ఇంటిచిట్కా.

రాత్రుళ్ళు ఒక స్పూన్ ధనియాలు గ్లాసు నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే ధనియాలతో సహా మరిగించి చల్లారాక వడకట్టి గోరువెచ్చగా తీసుకోవాలి. 

ధనియాలు మూత్రపిండాల్లో ఉన్న టాక్సిన్లు శుభ్రంచేసి మూత్రం ద్వారా బయటకు పంపేస్తాయి. రక్తపోటు తగ్గిస్తుంది. ధనియాలలో ఫైబర్ అధికంగా ఉండి జీర్ణక్రియను వేగవంతం చేసి మలబద్దకం, ఎసిడిటీ, గ్యాస్ ను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి మధుమేహాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి బాగా సహాయపడుతుంది. బీన్స్ను ఎక్కువగా తీసుకున్న సోడియం లెవల్స్ అదుపులో ఉండేలా చేస్తుంది. ఉడకబెట్టిన బంగాళదుంపలను, విటమిన్ సి ఉన్న పండ్లు కమలా, బత్తాయి పండ్ల రసాలను తీసుకోవడం వలన కూడా వాపులు తగ్గుతాయి. గోరువెచ్చని నీటిలో కొంతసేపు, చల్లని నీటిలో కొంతసేపు మార్చి మార్చి కాళ్ళు పెట్టడం వలన కూడా వాపులు తగ్గుతాయి. వాకింగ్, రన్నింగ్ వ్యాయామం, ఈత జీవితంలో భాగంచేసుకోవడం వలన కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు.

Leave a Comment

error: Content is protected !!