శరీరంలో కొన్ని విటమిన్స్, ప్రోటీన్లు లోపం ఉన్నవారు తరచూ అనేక సమస్యలతో బాధపడుతుంటారు. కొంతమంది చిన్న వయసులోనే కాళ్ళు నొప్పులు, కీళ్ళనొప్పులుతో బాధపడుతుంటారు. వీటికి ముఖ్యకారణం కాల్షియం లోపం. కాల్షియం లోపాన్ని అరికట్టేందుకు సప్లిమెంట్స్ తీసుకునేవారు సహజ ఆహార పదార్థాలు ఉపయోగించి కూడా ఈ సమస్యను అధిగమించవచ్చు. దానికోసం మనం కాల్షియం రిచ్ పుడ్స్ తీసుకోవాలి. వాటితో పాటు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ తాగడంవలన కాల్షియం సమృద్ధిగా పొందవచ్చు. దానికోసం మనకు కావలసిన పదార్థాలు నువ్వులు. నువ్వులలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది.
తెలుగువారు నువ్వులను సాంప్రదాయ ఆహార పదార్థాలలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మన పూర్వీకులు ఆహారం ద్వారా మనకు కావలసిన ఖనిజాలను, విటమిన్లను సమృద్ధిగా పొందేందుకు వీలుగా ఈ ఆహార పదార్థాలు వినియోగించేవారు. ఆధునిక ఆహారానికి అలవాటుపడి మన పురాతన ఆహార పదార్థాలను నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుకే ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి. నువ్వులను ఆహారపదార్థాల్లో భాగం చేసుకోవడం వల్ల క్యాల్షియం లోపాన్ని తగ్గించుకోవచ్చు. నువ్వులతోపాటు మనకు కావలసిన పదార్థాలు గసగసాలు.
గసగసాలు కూడా కాల్షియం సమృద్ధిగా అందించి నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. కొంత మంది రాత్రి నిద్ర పట్టక బాధపడుతూ ఉంటారు. వారికి ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది తర్వాత పదార్థం బాదం. బాదం పప్పులు కూడా శరీరానికి కావల్సిన ఎనర్జీని అందించి ఉత్సాహంగా ఉండేందుకు సహకరిస్తాయి. క్యాల్షియం పుష్కలంగా లభించి ఎముకలను బలంగా చేసి నొప్పుల నుండి దూరం చేస్తాయి. ఈ మూడింటిని నూనె లేకుండా వేయించి మిక్సీలో వేసి మెత్తగా పొడిలా చేసుకోవాలి. ఒక గ్లాసు పాలను మరిగించి అందులో ఈ మిశ్రమాన్ని చిన్న వారికైతే ఒక స్పూన్ పెద్దవారికి రెండు కలిపి చిన్న బెల్లం ముక్క లేదా పటికబెల్లం కలిపి తాగాలి.
పాలు తాగని వారు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. ఈ పొడిని ఒక స్పూన్ తిని గోరు వెచ్చని నీళ్లు తాగడం వలన మంచి ఫలితం ఉంటుంది. వీలైనంత వరకు ఈ చిట్కా కోసం ఆవు పాలు ఉపయోగించడం మంచిది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ పాలు తాగడం వలన శరీరంలో కాల్షియం లోపం తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనేక రకాల నొప్పులు నుండి ఉపశమనం లభించి అనారోగ్యాలు కనుమరుగవుతాయి.