మన చేతిగోళ్లు మన ఆరోగ్యానికి ప్రతిబింబంగా పనిచేస్తాయి అంటే మీరు నమ్ముతారా. కానీ నిజంగా ఇది నిజం. మన చేతి గోళ్ళపై ఉండే రకరకాల మచ్చలు, గీతలు మన ఆరోగ్య సమస్యలను మనకు తెలిపే సూచనలు గా పనిచేస్తాయి.
మనం గోళ్ళను గమనించడం ద్వారా మన ఆరోగ్య సమస్యలను తెలుసుకోవచ్చు. చేతి గోళ్లలో అర్థ చంద్రాకారంలో కొంచెం భాగం ఉంటుంది. ఈ భాగాన్ని లూనోలా అంటారు. ఈ అర్థ చంద్రాకార భాగం తెల్లగా పాలిపోయి ఉంటే వారికి రక్తహీనత, పోషకాహార లోపంతో బాధపడుతున్నారని అర్థం.
అలాగే లూనోలా పెద్దగా ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్లు సూచన. పెద్దగా ఉంది అంటే వారిలో థైరాయిడ్ గ్రంధి, జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని అర్థం. అర్ధచంద్రాకారం నీలం రంగు లేదా పాలిపోయి ఉంటే వారికి డయాబెటిస్ వస్తున్నట్లు అర్థం.
ఈ తెల్లటి గుర్తు చిన్నగా ఉంటే ఆ వ్యక్తిలో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. వారు అజీర్ణంతో బాధపడుతున్నారని సూచనగా భావించవచ్చు. వారి శరీరంలో టాక్సిన్లు పేరుకుపోయి ఉండవచ్చు. గోళ్ల మీద తెల్లటి మచ్చలు ఉంటే వారిలో క్యాల్షియం, జింక్ తక్కువగా ఉన్నట్లు అర్థం.
అంతే కాకుండా శరీరానికి తగిన పోషకాలు అందక, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం జరిగితే ఇలాంటి మచ్చలు గోళ్ళ మీద వస్తాయి. మనకున్న పది చేతి వేళ్లలో కనీసం 8 ఇది వేళ్ళ లో లూనోలాతో ఆరోగ్యంగా ఉండాలి.
లేకపోతే ఆ వ్యక్తి లో విటమిన్ A, ప్రోటీన్స్ లోపం ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందకపోయినా ఇలా లూనోలా లేకుండా ఉంటుంది. మన శరీరం ఆరోగ్యంగా ఉండటం కోసం వ్యాయామం, పౌష్టికాహారం బాగా తీసుకోవాలి.
చేతి గోళ్ళు తెల్లగా పాలిపోయి ఉంటే వారిలో రక్త కణాలు తక్కువగా ఉన్నట్లు సూచన. కొంతమందికి గోళ్లు పసుపు రంగులో మారిపోయి ఉంటాయి. వీళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు అర్థం. గోళ్లు పసుపు రంగులో ఉంటే వాళ్లలో లివర్ కి సంబంధించిన జబ్బు ఉన్నట్లు, అలాగే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నట్లు భావించాలి.
నెయిల్ పాలిష్ ఎక్కువగా వాడే వారిలో కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. గోర్లు ఎక్కువ రోజులు పసుపుగా ఉంటే వారికి కామెర్లు వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి చేతి గోళ్లలో నల్లటి గీతలు వస్తుంటాయి. దీనికి అనేక చర్మ క్యాన్సర్ కారణం అవ్వచ్చు.
కొంతమంది గోళ్లు పలుచబడి పగిలి పోతుంటాయి. వారిలో చర్మ సంబంధ సమస్యలతో బాధపడుతూ ఉంటే ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా గోళ్ళను అప్పుడప్పుడు పరిశీలిస్తూ మీ శరీరంలో వస్తున్న మార్పులను, రోగ సూచనలను గమనించి సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండండి.