10 tips to maintain healthy teeth and keep cavities at bay

దీంతో పిప్పిపన్ను కు చరమగీతం ఇది వాడితే పిప్పి పన్ను, నొప్పికి సెకండ్స్లో దూరం

ఇప్పటి రోజుల్లో జంక్ ఫుడ్, స్వీట్లు, కూల్డ్రింక్స్ అధికంగా తినడం వలన కనీసం పది మందిలో ఎనిమిది మందికి పంటికి ఏదో ఒక చోట పుచ్చు, నొప్పి వంటి సమస్యలు చాలా సాధారణం. సహజ పదార్థాల చిట్కాలు ద్వారా నొప్పి తగ్గించుకుని, కొత్తగా పంటి సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు గాని పాడైన పన్ను రక్షించుకోలేం. వీటిని నిర్లక్ష్యం చేసే కొద్ది విపరీతమైన నొప్పి, వాపు వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి చాలా వరకు కుచ్చు ఉంటే డాక్టర్లు దానిని రూట్ కెనాల్ ద్వారా క్లీన్ చేసి సిమెంట్ వేసి దానిని రక్షించేందుకు క్యాప్ వంటి ట్రీట్మెంట్లు ఇస్తారు. అయితే చాలా సార్లు మనం పంటిని గమనించకుండా వదిలేయడం వలన పళ్ళు పుచ్చిపోయి వాటిని తీసేయవలసిన పరిస్థితి వస్తుంది.

 కొంత మంది డాక్టర్ల దగ్గర పన్ను తీయించుకోవడానికి చాలా భయపడుతుంటారు. ఇలా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువై లోపల ఉండే ఎముక దెబ్బతింటుంది. ఇప్పటి కాలంలో ప్రతిచోటా డెంటల్ డాక్టర్ అందుబాటులో ఉండటం వలన పంటి సమస్యలకు చికిత్స తీసుకోవడం సులభం అయింది. కానీ పూర్వకాలంలో పంటిని తీసేయవలసి వస్తే పాడైన పంటిలో ఇంగువ ముక్కను పెట్టేవారు. ఇలా చేసిన ఒక గంట తర్వాత దానిని తీసి పడేసి మళ్ళీ మరుసటి రోజు కూడా ఇలాగే ఇంగువ పెట్టాలి. ఇలా కొన్ని రోజులపాటు చేయడం వలన పంటి సమస్యలు తగ్గడంతోపాటు బలహీన పడి విరిగి ముక్కలు ముక్కలుగా వచ్చేస్తుంది.

 దాని రూట్ బలహీన పడడం వలన దానికి అదే ఊడిపోతుంది. అయితే ఇంగువ మిగతా పళ్ళకు  తగలడం మంచిది కాదు. పన్ను తీసేయవలసిన పరిస్థితి వస్తే మాత్రమే ఈ టిప్స్ పాటించాలి. వీలైనంతవరకూ పంటిని రక్షించుకునేందుకు చిన్న చిన్న సమస్యలు రాగానే డాక్టర్ని సంప్రదించడం మంచిది. పన్ను శరీరంలో ముఖ్యమైన అవయవాలతో కనెక్ట్ అయి ఉండడం వలన పంటి సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల శరీర ఆరోగ్యం దెబ్బతింటుంది. పంటి నొప్పి, పంటి పుచ్చు మొదలైన ప్రారంభదశలోనే డాక్టర్లను సంప్రదించడం ద్వారా పంటిని తీసేయవలసిన అవసరం లేకుండా కాపాడుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!