11 amazing health benefits of bananas

బడ్జెట్ లో ఆరోగ్యం… అరటిపండుతో లభ్యం….

వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఇష్టపడే పండు అరటిపండు. పేదవాడి యాపిల్ పండుగా కూడా అరటిపండు ప్రసిద్ధి చెందింది. ఈ అరటిపండులో అనేక రకాలున్నాయి. కర్పూర, చెక్కరకేళి, దేశవాళీ,బొంత,పచ్చ అరటిపండ్లు, కేరళ అరిటిపండ్లు, అమృతపాణి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో …

సంవత్సరం పొడువునా దొరుకే పండు కాబట్టి మిగతా పండ్లు తిన్నట్టే వీటినీ తింటారు, కానీ ఈ అరటిపండులో ఉన్న ఔషద గుణాలు, వాటి ప్రయోజనాల గురుంచి చాల మందికి తెలియదు.

ఇప్పుడు, అరిటిపండు మన శరీరానికి చేసే మేలు ఏంటో తెల్సుకుందాం

  1. అరిటిపండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆహరం సరిగ్గా జీర్ణం కావాలంటే, రోజుకి ఒక అరిటిపండు తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.
  2. మన శరీరంలో రక్తహీనత పోవాలంటే అరిటిపండు వారానికి మూడు సార్లైనా తినాలి.
  3. అరటిపండ్లను తినడం వలన రక్తపోటు నియంత్రణలో ఉండి, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
  4. అరటిపండులో ఉండే పీచు పదార్ధాలు మలబద్ధకం లాంటి దీర్గకాల సమస్యని కూడా నివారిస్తుంది.
  5. అరటిపండులో పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన చిన్న పిల్లల్లో కాళ్ళ నొప్పులు, గర్భిణి స్త్రీలలో వచ్చే క్రామ్ప్స్ పూర్తిగా తగ్గిపోతాయి. మీరు చూసినట్టయితే.. క్రీడాకార్లు ఎక్కువగా అరటిపండుని తింటుంటారు. అలిసిన శరీరానికి, తక్షణమే శక్తిని అందిస్తుంది అరటిపండు.
  6. సన్నగా ఉన్న పిల్లలికి ఉదయం బ్రేక్ఫాస్ట్ లో ఒక పండు..అలానే రాత్రి పడుకునే ముందు ఒక పండుని తినిపిస్తే, ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
  7. అరటిపండులోని పీచు పదార్ధం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి.జబ్బున పడినవారు అరిటిపండు తీసుకుంటే.. త్వరగా కోలుకుంటారు.
  8. అరటిపండులోని పొటాషియం శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
  9. డైటింగ్ చేసేవారు ఒక పూట భోజనమో, లేక టిఫిన్ మానేసి.. దాని బదులుగా ఒక గ్లాస్ పాలతో..ఒక అరటిపండుని తింటే   ..శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి.
  10. అరిటిపండు ప్రకృతి సిద్ధ యాంటాసిడ్ గా పనిచేస్తుంది. పొట్టలో ఆమ్లాలు ఎక్కువైతే ఒక అరటిపండు తప్పకుండా తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. యంటాసిడ్ ప్రభావం పొట్టలో ఉండే అల్సర్స్ ని తగ్గిస్తుంది, కడుపులో మంటని నివారిస్తుంది.
  11. నిద్రలేమి తనం, అరటిపండుతో అరికట్టవచ్చు. పడుకునే ముందు ఒక పండుని తినండి.. ఇట్టే నిద్రపట్టేస్తుంది.

ఎన్నో ప్రయోజనాలు ఉన్నఈ పండుని తిని మీ ఆరోగ్య సమస్యల నుండి బయట పడండి.

Leave a Comment

error: Content is protected !!