ఇప్పటిరోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య అధికబరువు.కొంతమందికి బద్దకం,సరైన వ్యాయామం లేకపోవడం,అనారోగ్య ఆహారపుటలవాట్లు వలన అయితే మరికొంతమంది జన్యుపరమైన లోపాలతో అధికబరువును కలిగి ఉంటున్నారు.ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవనానికి అధికబరువుని తగ్గించుకోవడం ఒకటే మార్గం.
బరువు తగ్గడానికి అనేకమార్గాలు ఉన్నాయి .అందులో జిమ్,యోగాలాంటి వ్యాయామాలతో పాటు మనం తినే ఆహారం కూడా ప్రముఖపాత్ర పోషిస్తుంది.బరువు తగ్గడానికి నూనెలు,మసాలాలు,మైదా సంబంధిత పదార్థాలకు దూరంగా ఉండడంతో పాటు పండ్లు,కూరగాయలు,మొలకెత్తిన గింజలు, చిరుధాన్యాలు లాంటి ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లకు మారాల్సి ఉంటుంది.ఆ ఆహారంలో మన ఇంట్లోనే ఉండే కొన్నిపదార్థాలు భాగం చేసుకోవడం ద్వారా ఇంకాస్త త్వరగా బరువును తగ్గించుకోవచ్చు అని మీకు తెలుసా.
అందులో ముఖ్యమయినది వెల్లుల్లి.మామూలుగానే వెల్లుల్లిని వంటలలో వాడుతుంటాం.వంటలకు రుచి ఇవ్వడానికి అల్లంతో కలిపి వాడతాం.అలాకాకుండా బరువుతగ్గడం కోసం ఈసారి ఇలా ప్రయత్నించి చూడండి.ఆరేడురెబ్బల వెల్లుల్లిని పొట్టు వొలిచి నూనెలేకుండా వేయించి పరగడుపున తినడం వలన అందులో ఉండే అల్లిసన్ అనే ఎంజైమ్ అల్లిన్ ను అల్లిసస్గా మారుస్తోంది.ఈ ఎంజైమ్ కు కొవ్వుకణాలను కరిగించే శక్తి ఉంది. అంతేకాకుండా వెల్లుల్లి జీర్ణక్రియను మెరుగుపరచగలదు. సరైన జీర్ణక్రియ వలన అధిక కొవ్వు పోగుపడదు.గ్యాస్,కడుపుబ్బరం సమస్యలు దరిచేరవు.
ఇందులో ఉండే ఔషధ గుణాలవలన డిప్రెషన్,డయాబెటిస్,కొన్నిరకాల కాన్సర్ లను రాకుండా చేయగలదు.ఇందులో ఉండే విటమిన్ బి 6, విటమిన్ c ,ఫైబర్,మెగ్నీషియం,కాల్షీయం,ప్రొటీన్ మరియు చక్కెరలు ఉన్నాయి.ఇవి గుండె జబ్బులు రాకుండా చేసి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా కూడా చేస్తాయి.రక్తం మందంగా ఉన్నవారికి వెల్లుల్లి మంచి ఔషధమని చెప్పొచ్చు.
ఫైబర్(పీచుపదార్థం) మలబద్దకాన్ని తగ్గించి రక్తంలోనికి మలినాలను చేరకుండా నిరోధిస్తుంది.వెల్లుల్లిని రాత్రి నానబెట్టి ఆ నీటిని తాగడం వలన ఆనీరు ఒంట్లో ఉండే టాక్సిన్స్లను తొలగిస్తుంది .వెల్లుల్లిని వేయించి తేనెతో తీసుకోవడం వలన రెండింటి ఔషధ గుణాలతో త్వరగా బరువు తగ్గొచ్చు.వెల్లుల్లి తన యాంటీ ఆక్సిడెంట్ల వలన కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతుంది. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తినడం ద్వారా అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలతో పాటు బరువుని కూడా తగ్గించుకోవచ్చు.వెల్లుల్లి గురించి మరింత సమాచారం కోసం వీడియో చూడండి.
వెల్లుల్లి గురించి సమాచారం
ఇచ్చినందుకు ధన్యవాదములు
Super