ప్రతి ఇల్లాలు తప్పనిసరిగా తెలుసుకోవలసిన వంటింటి చిట్కాలు…
- క్యాబేజీ ఉడికించేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే ఉడికేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ ఒక 6 లవంగాలు వేసి ఉడికించాలి.
- ఉడికించిన కోడిగుడ్లు మిగిలితే పైన చెక్కు తీయకుండా ఒక చిన్న గిన్నెలో వాటర్ పోసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. మరుసటిరోజు వరకు చెడిపోకుండా ఉంటాయి.
- స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు షుగర్ బదులు షుగర్ పౌడరు వాడండి దీనివల్ల స్వీట్స్ చాలా రుచిగా ఉంటాయి.
- పాలు విరుగుతాఏమో అని మీకు సందేహం గా ఉంటే అందులో కొద్దిగా యాలకుల పొడి వేసి కంచితే పాలు విరగకుండా ఉంటాయి.
- నెయ్యి మంచి సువాసన రావాలంటే కాచి దింపేముందు 10 మెంతులు లేదా రెండు తమలపాకులు తుంచి వేయండి.
- మీకు పెరుగు పులిసినట్టు అనిపిస్తే ఆ పులుపు పోవాలంటే కొన్ని కొబ్బరి మొక్కలు పెరుగులో వేయాలి కొద్దిసేపు తర్వాత పులుపు తగ్గిపోతుంది.
- నిమ్మకాయలు తాజాగా నిల్వ ఉండాలంటే వాటికి కొద్దిగా వంట నుండి రాశి ఫ్రిజ్ లో పెట్టుకోండి దాదాపు 20 నుండి 25 రోజులు చెడిపోకుండా ఉంటాయి.
- కరివేపాకు ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే ఆకుల విడదీసి ఒక గాజు సీసాలో భద్రపరుచుకోండి. ఈ సీసాను ఫ్రిజ్ లో పెట్టుకోండి.
- ఆపిల్స్ పాడవకుండా ఉండాలంటే బంగాళదుంపలతో పాటు ఉ నిలవ ఉంచుకోండి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
- ఏదైనా ఆకుకూర వాడిపోయి ఉన్నప్పుడు ఉప్పు నీళ్లలో వేర్లు మునిగే విధంగా కొద్దిసేపు ఉంచుకుంటే అవి మరలా తాజాగా మారుతాయి.
- ఆకుకూరలు ఎక్కువగా తాజాగా ఉండాలంటే వేర్లు కట్ చేసుకుని పేపర్ లో చుట్టి ఒక కవర్లో పెట్టుకొని ఫ్రిజ్లో పెట్టుకోవాలి ఇలా చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి
ఇవి కూడా మీకు నచ్చవచ్చు … Read below articles too…