11 ways to curb your drinking

మందుబాబులకు మీరు ఇలా చేస్తే లైఫ్ లాంగ్ మందు షాపు వైపు కూడా వెళ్లరు

మందు తాగే అలవాటు చాలామంది కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. కొంతమంది ఈ అలవాటుపై నియంత్రణ లేక డబ్బు, జీవితాన్ని కూడా కోల్పోతుంటారు. మద్యం అధికంగా తీసుకునేవారు లివర్ పాడయికపోవడం వలన అనారోగ్యం బారిన పడి చనిపోతుంటారు. అలాగే ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలు రోడ్డున పడిన సందర్భాలు ఎన్నో. అలాంటి మద్యాన్ని మానిపించడానికి కొన్ని రిహాబిలిటేషన్  సెంటర్లు సాయం చేస్తుంటాయి. కానీ కొంతమందిని ఒప్పించడం, అక్కడ వరకు తీసుకువెళ్లడం, చికిత్స ఇప్పించడం కష్టం. ఖర్చు కూడా ఎక్కువే ఉంటుంది.

 మద్యం తీసుకునే వారికి రిహాబిలిటేషన్ సెంటర్ కి తీసుకు వెళ్ళకుండా ఇంట్లోనే మద్యం మానిపించడానికి ఇప్పుడు చెప్పబోయే మందు ఇవ్వడం వలన త్వరగా అలవాటు నుండి బయటపడతారు. దీనికోసం కరక్కాయలు తీసుకోవాలి. కరక్కాయలను మనం వాత, పిత్త దోషాలు తగ్గించడానికి ఔషధంగా ఇస్తూ ఉండడం పిల్లల్లో జలుబు, దగ్గు సమస్య ఉన్నప్పుడు కూడా ఔషధంగా ఇవ్వబడుతుంది. అంతేకాకుండా ఈ కరక్కాయ తన వగరు రుచితో మందు పై విరక్తి వచ్చేలా చేస్తుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గడాన్ని పెంచుతుంది.  మధుమేహాన్ని నిర్వహిస్తుంది.  నోటి పరిశుభ్రతను మెరుగుపరుస్తుంది.   చర్మం మరియు జుట్టుకు మంచిది.  శరీరంలో ఉన్న అన్ని దోషాలపై ప్రభావం చూపుతుంది. 

ఇప్పుడు ఈ ఔషధాన్ని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. కరక్కాయలను ఒక నాలుగు తీసుకోవాలి. వీటిని దంచి ఇందులో ఉండే విత్తనాలను తీసేయాలి. పైన ఉండే బెరడును మెత్తని పొడి చేసుకోవాలి. ఈ పొడిని అర స్పూన్ మొత్తంలో తీసుకొని 10 చెంచాల నీటిని కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపి బ్రేక్ఫాస్ట్ చేసిన తరువాత కనీసం ఒక నెల రోజుల పాటు తాగడం వలన మంచి ఫలితం ఉంటుంది. మందు మానేయాలి అని కోరుకుంటూ ఆ అలవాటును మానలేక పోతున్న వారికి ఇది చాలా బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా మందు తాగడం వలన శరీరంలో పేరుకున్న అనేక రకాల విష పదార్థాలను బయటకు పంపడంలో కూడా సహాయపడుతుంది.

Leave a Comment

error: Content is protected !!