12 best indian ancient health tips

చాలా మందికి తెలియని 12 ప్రాచీన ఆరోగ్య సూత్రాలు

మనిషి యొక్క ఆరోగ్యమైన జీవితానికి మన పెద్దలు సూచించిన పురాతన కాలం నాటి 12 ఆరోగ్య సూత్రాలు గురించి ఇప్పుడు తెలుసుకోండి. కనీసం అందులో నాలుగు సూత్రాలు పాటించిన జీవితంలో సగానికి పైగా రోగాలను తగ్గించుకోవచ్చు. ఇవన్నీ అసలు ఖర్చు లేకుండా మన ఆరోగ్యాన్ని , ఆయుష్షును పెంచే సూత్రాలు. అవి.

1) అజీర్ణే భోజనం విషం, అజీర్ణే భేషజ వారి:

మనం తిన్న ఆహారం పూర్తిగా అరగకుండా ఎప్పుడు తినకూడదు. తిన్నవి జీర్ణం కాకుండా మళ్ళీ వెంటనే తినడం వల్ల అజీర్ణం ఏర్పడుతుంది. అలాగే అజీర్ణం ఉన్నప్పుడు  నీరు కొద్ది కొద్దిగా తాగడం వలన అది అమృతంలా పనిచేసి ఆహారాన్ని జీర్ణం చేయడంలో అద్బుతంగా సహాయపడుతుంది.

Full Youtube Video link : https://youtu.be/j3g_zC1P-1c

2) అర్థ రోగ హరి నిద్ర:

సరైన నిద్ర వలన సగానికి సగం జబ్బులు తగ్గిపోతాయి అనేది మన పూర్వీకులు చెప్పే మాట. కనీసం రోజుకు ఆరు, ఏడు గంటలు నిద్ర వలన శరీరానికి తగిన విశ్రాంతి లభించి తనను తాను రిపేర్ చేసుకుంటుంది. మనం వాడే ఫోన్లు, టీవీల ఎల్ ఈ డి లైట్స్ వలన నిద్రాభంగం వాటిల్లకుండా పడుకోవడానికి గంట ముందు నుంచి  వాటికి దూరంగా ఉండాలి. ఒక పది నిమిషాలు గట్టిగా ఊపిరి తీసి వదలడం వల్ల మంచిగా నిద్ర పడుతుంది.

3) న వైద్యః ప్రభురాయుషః :

జీవిత కాలాన్ని పెంచే శక్తి డాక్టర్ల చేతిలో కూడా లేనిపని అనేది ఈ సూత్రం యొక్క అర్థం. ఆ శక్తి కేవలం మన చేతుల్లో మాత్రమే ఉంది. మనం మన హెల్త్ గురించి తీసుకునే జాగ్రత్తలు మాత్రమే మన ఆయుష్షును పెంచుతాయి.

4) చింతావ్యాధి ప్రకాశయా :

మానసిక చింతనలు జబ్బులను పెంచుతాయి అనేది ఈ సూత్రం యొక్క అర్థం. అందుకే మానసిక ఆందోళనలకు దూరంగా ఉండాలి.

5) అజవత్ చర్వణం కుర్యాత్ః :

ఆహారాన్ని మేకలాగ బాగా నమలాలి అనేది ఈ సూత్రం యొక్క అర్థం. తిన్న ఆహారం 70శాతం నోట్లోనే బాగా జీర్ణం అయ్యేలా 20 నుండి 36 సార్లు నమలాలి.

6) స్నానం నామ మనఃప్రసాదనకరం దుస్వప్న విధ్వసనం :

పడుకునేముందు స్నానం మనఃశ్శాంతిని అందించి పీడకలలు నిరోధించగలదు. నిద్రలేమి, మానసిక ఆందోళనలు ఉన్నవారు స్నానం చేయడం వలన మనఃశ్శాంతి పొందవచ్చు.

7) న స్నానం ఆచరేత్ భుక్త్వా :

ఆహారం తిన్న వెంటనే ఎప్పుడు స్నానం చేయకూడదు. అది అజీర్ణానికి, కడుపులో ఇబ్బందికి దారితీస్తుంది, రక్తప్రసరణకు భంగం ఏర్పరుస్తుంది.

8) సర్వత్రా నూతనంశాస్త్రం సేవకాన్న పురాతనం:

తినే ఆహారం, చేసే పని ఎప్పుడూ తాజాగా ఉండాలి అనేది ఈ సూత్రం అర్థం. ఫ్రిజ్ లో నిల్వ పెట్టిన కూరలు, జాడీల్లో దాచే నిల్వపచ్చళ్ళు తినడం వలన ఆరోగ్యానికి మంచిది కాదు. కూరగాయలు, ఆకుకూరలు వారాల తరబడి నిల్వ ఉంచకుండా తాజాగా తెచ్చుకొని వాడుకోవాలి.

9) నిత్యం సర్వారసాభ్యాసం :

రోజూ తీసుకునే ఆహారంలో షడ్రుచులను అన్నింటినీ ఎంతో కొంత మొత్తంలో తప్పకుండా తీసుకోవాలి. చేదు కాకరకాయ, మెంతికూరను కూడా  ఆహారంలో చేర్చుకోవాలి.

10) జఠరం పూరమేదర్థం అన్నహి :

భోజనం సమయంలో కడుపులో సగభాగం మాత్రమే నిండాలి. పావుభాగం రసం, సాంబార్ వంటి ద్రవ పదార్థాలతో నింపాలి. మిగిలిన పావు భాగం కడుపును ఖాళీగా ఉంచుకోవాలి.

11) చింతా జరానాం మనుష్యాణం :

ఆందోళనలు మనుషులకు త్వరగా ముసలిలక్షణాలు వచ్చేలా చేస్తాయి. అందుకే వీలైనంత వరకూ ఆందోళనలకు దూరంగా, మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.

12)శతం విహాయ భోక్తవ్యం :

ఎన్ని పనులు ఉన్నా సమయానికి భోజనం చేయాలి. సమయం దాటిపోయాక తినడం వల్ల అనారోగ్య సమస్యలు బారిన పడే అవకాశం ఉంటుంది.

Leave a Comment

error: Content is protected !!