12 Home Remedies for Toothaches That Actually Work

రెండు నిమిషాల్లో పిప్పి పన్నులో ఉండే పురుగులు మాయం, పంటినొప్పి తగ్గుతుంది

 సాధారణంగా సాధారణంగా అందరికీ పన్ను నొప్పి రావడం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం సరిగ్గా నోటి శుభ్రత పాటించకపోవడం.  పిప్పి పన్ను నొప్పి తగ్గించుకోవడానికి రకరకాల మందులను  ఉపయోగిస్తూ ఉంటారు.ఈ మందుల వలన సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి.  కొంతమంది అయితే పళ్ళు కూడా తీయించుకుంటూ ఉంటారు.  అలాంటి అవసరం లేకుండా ఈజీగా ఇంట్లో ఉండే  వాటితో పంటినొప్పిని తగ్గించుకోవచ్చు. 

    నోటి శుభ్రత పాటించి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పిప్పి పన్ను నొప్పి కోసం  హాస్పిటల్ కి వెళ్లే అవసరం లేకుండానే తగ్గించుకోవచ్చు. జామకాయలో ఎన్ని ఆరోగ్య  ప్రయోజనాలు కలిగి ఉంటాయో   అలాగే జామాకులు కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. దీనిలో అధిక ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ కలిగి ఉంటాయి. జామాకులతో ఇలా చేసి ఉపయోగించినట్లయితే పిప్పి పన్ను నొప్పి వెంటనే తగ్గిపోతుంది. 

      పన్ను నొప్పి రావడానికి కారణం వైరస్ ఇన్ఫెక్షన్ పెరిగి పన్ను పాడు చేయడం వలన పన్ను నొప్పి  వస్తుంది. ముందుగా జామ ఆకులను శుభ్రంగా కడిగి రెండు లేత జామ ఆకులను తీసుకొని మెత్తగా దంచి రసం తీసుకోవాలి. రసంలో పావు చెంచా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. పసుపు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది. కాటన్ తీసుకుని  జామాకు రసంలో ముంచి నొప్పి వచ్చే  పిప్పి పన్ను మీద పెట్టి అరగంట పాటు ఉంచాలి.  ఇది పెట్టి   ఉన్నంత సేపు ఏమీ తినకూడదు, తాగకూడదు. 

       ఇలా చేయడం వలన పిప్పిపన్ను లోపల ఉండే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తగ్గి పిప్పి పన్ను నొప్పి కూడా తగ్గుతుంది. రెండవ చిట్కా స్టౌ మీద గిన్నె పెట్టి అర లీటర్  నీళ్ళు పోసుకొని ఐదు లేదా ఆరు జామ ఆకులను శుభ్రంగా కడిగి వేసుకోవాలి. నీరు రంగు మారేంతవరకూ మరిగించి తర్వాత స్టవ్ ఆఫ్  చేసి నీటిని  చల్లార్చుకోవాలి. తర్వాత  పావు చెంచా పటిక పొడి   వేసి బాగా కలిపి ఆ నీటితో నోటిని పుక్కిలించడం వలన నోటి దుర్వాసన, నోటి సమస్యలు, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తగ్గుతాయి. 

     ఈ చిట్కాలు  చేయడానికి సమయం లేదు అనుకున్న వారు రోజు రెండు జామాకులను నమిలి రసం మింగటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. పంటి నొప్పి బాగా ఎక్కువగా ఉంది అనుకున్న వారు ఈ రెండు చిట్కాలు తప్పనిసరిగా పాటించండి. రెండు లేదా మూడు రోజులు చిట్కాలను పాటించినట్లైతే పంటినొప్పి తగ్గిపోతుంది. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీన్ని అన్ని వయసుల వారు ఉపయోగించవచ్చు.

Leave a Comment

error: Content is protected !!