దగ్గు, జలుబు తలనొప్పి లాంటి సాధారణ జాబితాలో కడుపునొప్పి కూడా ఒకటి. అయితే ఈ కడుపునొప్పి దీర్ఘకాలంగా కొనసాగితే మాత్రం ఏదో సమస్య ఉన్నట్టే లెక్క. దీన్ని గమనించకుండా అలాగే నిర్లక్ష్యం చేస్తే గోటితో పోయేదాన్ని గొడ్డలితో తీయాల్సిన చందాన సమస్య పెరుగుతుంది. అయితే ఈ దీర్ఘకాల సమస్యకు పేగులలో పుళ్ళు ఏర్పడం, బాక్టీరియా, సూక్ష్మజీవులు వ్యాపించడం లాంటి కారణాలు ఉండవచ్చు, గుండెకు సంబంధించిన కారణాలు, లివర్ కు సంబందించిన కారణాలు మూత్రాశయం వ్యవస్థకు సంబందించిన కారణాలు కూడా దీర్ఘకాలిక కడుపునొప్పికి కారణం అవుతాయి.
ఈ కడుపునొప్పిని సులువుగా తగ్గించుకోవడానికి ఆరోగ్య చిట్కాలు మీకోసం.
◆ వామును తగినంత ఉప్పు కలిపి మెత్తగా నూరి నీళ్లలో వేసి చిక్కటి కషాయంగా గానీ, నేరుగా మజ్జిగలో కలిపి గానీ తీసుకోవాలి దీనివల్ల అజీర్తి మరియు గ్యాస్ ట్రబుల్ కారణంగా వచ్చే కడుపునొప్పి తగ్గుతుంది. అరచెంచా వరకు వాము పొడి తీసుకోవచ్చు, కడుపులో వాతం, నొప్పి, మంట, ఎక్కిళ్ళు, త్రేన్పులు తగ్గి పేగులకు, గుండెకు మూత్రాశయ వ్యవస్థకు మేలు కలిగిస్తుంది.
◆ అరటిపండు, అరటికాయ, అరటి ఊచ మొదలైనవి ఆహారపదార్థాలుగా తీసుకోవచ్చు, కడుపులో నొప్పి తగ్గించే గొప్ప గుణాలు వీటిలో ఉంటాయి.
◆ చిన్నతనంలో అందరికి గచ్చకాయ సుపరిచితమే, ఈ గచ్చకాయ లోపలి పప్పును సానమీద అరగదీసి లేదా మెత్తగా నూరి నాలుగు భాగాలుగా చేసి ఒకబాగాన్ని రోజులో మూడు పూటలా తీసుకోవాలి. దీనివల్ల బాధించే కడుపునొప్పి కూడా తగ్గుతుంది.
◆ ఎవరికీ తెలియని అద్భుతమైన రహస్యం. చేమంతి పూలనుండి రసం తీసి ఆ రసంలో తేనె కలిపి తాగితే కడుపునొప్పి తగ్గుతుంది.
◆ ముల్లంగి మరియు ముళ్ల తోటకూర,లవంగాలు, శొంఠి ఇవన్నీ కడుపులో నొప్పిని తగ్గించే గుణం కలిగి ఉంటాయి. కాబట్టి సమస్య ఉన్నపుడు వీటిని అహరంలో భాగం చేసుకోవాలి.
◆ సునాముఖి ఆకు పొడిని చారులా కాచి గాని లేక తేనెతో కలిపి కానీ తీసుకుంటే విరేచనం ఫ్రీ అయి కడుపులో నొప్పి మరియు కడుపులో పోట్లు తగ్గుతాయి.
◆ మలబద్దకం ద్వారా కడుపునొప్పి కలిగితే ఉత్తమ పరిష్కారం వేడి నీళ్లు. ఉదయాన్నే నిద్రచేసిన తరువాత పరగడుపున దాదాపు అరళీటర్ నుండి లీటర్ వరకు వేడి నీళ్లు తీసుకోవడం వలన పేగులు శుభ్రపడి మలబద్దకం తగ్గిపోతుంది.
◆ నిమ్మకాయకు కూడా కఫుపునొప్పిని తగ్గించే శక్తి ఉంది. గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసాన్ని పిండి రోజులో అపుడపుడూ తాగుతూ ఉంటే కడుపునొప్పి తగ్గడమే కాకుండా అతి దాహం సమస్య కూడా తీరుతుంది.
చివరగా……
కడుపునొప్పి సాదారణమైనదే అయినప్పటికీ వేదిస్తుంటే మాత్రం పైన చెప్పుకున్న చిట్కాలు పాటించి తగ్గించుకోవచ్చు. ఒకవేళ తగ్గని పక్షంలో వైద్యున్ని సంప్రదించడం ఉత్తమం.