14 Best Benefits Of Tamarind Seeds For Skin Hair And Health

మగవారిలో లో కోరికలు తగ్గిపోతున్నాయా. వీటిని గుప్పెడు తింటే చాలు కీళ్ల నొప్పులు జీవితంలో రావు

పనికిరావని బయట పారేసే వీటిని ఒక గుప్పెడు గింజలు తింటే చాలు శరీరంలో కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడే వారికి పరిష్కారం లభించినట్లే. ముఖ్యంగా ఎముకల మధ్య ఉండే గుజ్జు అరిగిపోవడం వలన శరీరంలో ఎముకల మధ్య నొప్పులు వస్తుంటాయి. ఎముకల మధ్య గుజ్జు అరిగిపోవటం వలన ఎముకతో ఎముక రాసుకొని నొప్పి వస్తుంది. ఇలా అరిగిపోయిన వారు నడవలేక, సొంత పనులు కూడా చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్న, చిన్న పనులు చేసుకోవడానికి కూడా వీరు వేరొకరిపై ఆధారపడవలసి వస్తుంది. ఇలాంటి వారు ఆపరేషన్లు, మందులు అంటూ చాలా డబ్బులు వృధా చేస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటారు.. కానీ చాలా తక్కువ పదార్ధాలతో ఎముకల మధ్య ఉండే గుజ్జును పెంచే ఈ ఆయుర్వేద చిట్కా గురించి తెలుసుకోండి.

దీని కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు చింతగింజలు. అవునండి చింత గింజలే. చింత గింజల వలన మోకాళ్ల నొప్పులు , కీళ్ళనొప్పులు , పురుషులలో తగ్గిపోతున్న పటుత్వాన్ని పెంచడంతో పాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు. ఎలా తగ్గుతాయి అనుకుంటున్నారా? చింతగింజల్లో ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు మరియు ఖనిజాలతో నిండి ఉంటాయి. చింతపండు గింజలు సాంప్రదాయ జానపద వైద్య మరియు ఇంటి వైద్య చికిత్సలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

చింతగింజల విత్తనాలను పొడి చేసి తీసుకోవడం ద్వారా కీళ్ల నొప్పులు మరియు ఆర్థరైటిస్‌కు ఉపశమనం లభిస్తుంది.   ఈ చిట్కా కోసం చింత గింజలను కడిగి నీడలో ఆరబెట్టి తర్వాత  డ్రై రోస్ట్ చేసుకుని నానబెట్టాలి. మరసటిరోజు పైన తొక్క తీసేసుకోవాలి. చిన్న ముక్కలుగా చేసుకుని ఎండలో ఆరబెట్టాలి. తర్వాత వీటిని మిక్సీలో మెత్తని పొడిలా చేసుకోవాలి. చింతగింజలు అందుబాటులో లేనివారు చింతగింజల పొడి మార్కెట్ లో  దొరుకుతుంది. అది తీసుకోవాలి. ఈ పొడిని రోజు ఒక గ్లాసు పాలలో లేదా గోరువెచ్చని నీటిలో రెండు కలిపి తాగవచ్చు.

 ఇలా తాగడం వల్ల శరీరంలో ఎముకల మధ్య పెరిగి కీళ్ల నొప్పులు వెన్ను నొప్పి వంటివి తగ్గిపోతాయి. పురుషులు ఆవు పాలలో ఒక స్పూన్ చింతపిక్కల పొడి, కొంచెం పసుపు వేసి రాత్రి పడుకునేముందు తాగడం వలన లైంగిక సమస్యలు తగ్గిపోతాయి. శుక్రకణాల సంఖ్య పెరిగి, సంతాన వృద్ధి జరుగుతుంది. స్త్రీలలో కాల్షియం తగ్గి ఆర్థరైటిస్, కీళ్ళనొప్పులు వస్తుంటాయి. అలాంటి వారు ఇలా పాలలో చింత పిక్కల పొడి కలుపుకొని తాగడం వల్ల నొప్పులు తగ్గిపోతాయి. క్రమం తప్పకుండా రోజు ఈ డ్రింక్ తాగాలి. ఇలా తాగడం వలన శరీరంలో క్యాల్షియం పెరిగి నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు

Leave a Comment

error: Content is protected !!