శరీర అవయవాలలో శరీరాన్ని శుభ్రపరిచేందుకు ముఖ్యమైనవాటిలజ కాలేయం ఒకటి. శరీరంలో కాలేయం అనేవందల పనులను రోజూ చేస్తుంటుంది. కాలేయం దెబ్బతింటే భయంకరమైన చర్మవ్యాధులు, జబ్బులు వస్తాయి. కాలేయం దెబ్బతినడానికి ముఖ్యకారణాలు డాక్టర్ సలహా లేకుండా చాలామంది మందుల షాపులు నుండి తెచ్చిన మందులు విచ్చలవిడిగా వాడేస్తుంటారు.
అంతేకాకుండా కొంతమంది అధికంగా మద్యంతాగడం, జంక్ ఫుడ్ తినడం, ఒత్తిడి, మానసిక ఆందోళనలు శరీర ఆరోగ్యం పై కాలేయం మీద ప్రభావం చూపిస్తాయి. లివర్ ఆరోగ్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే జీర్ణవ్యవస్థలో కీలక మార్పులు వచ్చి శరీరవ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. మన వంటగదిలోనే ఉండే కొన్ని ఆహార వస్తువులతో మన లివర్ని శుభ్రం చేసుకోవచ్చు. ఆ వస్తువులతో కాలేయాన్ని డీటాక్స్ చేసి ఆరోగ్యం కోసం మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం.
ఇలా కాలేయాన్ని శుభ్రపరచడానికి మనం తీసుకోవలసింది సొరకాయ(ఆనపకాయ). సొరకాయ అంటే చాలా మంది తినడానికే ఇష్టపడరు కానీ సొరకాయ లో కాల్షియం, ఫాస్పరస్, జింక్, విటమిన్ సి, బీ కాంప్లెక్స్ వంటి అనేక ఖనిజాలు ఉంటాయి.
అలాగే ఫైబర్ అధికంగా ఉండి జీర్ణవ్యవస్థను కాపాడుతూ ఉంటుంది మలబద్దకం, గ్యాస్, మలవిసర్జన సులభతరం చేస్తుంది.. సొరకాయలో శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే గుణాలు అధికం. ఆహారం జీర్ణం కావడంలో సొరకాయ చాలా బాగా సహాయపడి యూరినరీ ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది. సొరకాయ వలన లివర్‌లో వాపును తగ్గించి అనారోగ్యాలు తగ్గిస్తుంది. అందుకే సొరకాయ జ్యూస్ తీసుకోవడం వలన లివర్ శుభ్రపడుతుంది.
అలాగే కొత్తిమీర కూడా లివర్, కిడ్నీ సంబంధ వ్యాధులు నివారిస్తుంది. కిడ్నీ, లివర్లను శుభ్రం చేసి వాపు, నొప్పులను తగ్గిస్తుంది. సొరకాయ మరియు ఒక కప్పు కొత్తిమీర, మిక్సీ పట్టాలి. అందులో కొంచెం నీరు కలిపి జ్యూస్‌లా తయారు చేయాలి. తర్వాత తీసుకోవాల్సింది పసుపు. పసుపు మంచి యాంటీబయోటిక్‌గా పనిచేసి శరీరం మొత్తాన్ని శుభ్రం చేస్తుంది. ఈ జ్యూస్ కాలేయంలో ఏర్పడిన విషపదార్థాలను శరీరం బయటకు చెమట,మూత్రం రూపంలో పంపించి కాలేయాన్ని శుభ్రం చేస్తుంది.
ఇందులోనే అరచెక్క నిమ్మరసం కలపాలి మరియు కొంచెం బ్లాక్ సాల్ట్ వేయాలి. నల్ల ఉప్పు లేకపోతే రాళ్ళ ఉప్పు ,అదీ లేకపోతే మాత్రమే కిచెన్ సాల్ట్ వాడుకోవచ్చు. ఈ జ్యూస్ పరగడుపున తాగాలి. ఇది తాగిన వెంటనే ఏమీ తినకూడదు. లేదా టిఫిన్ చేసిన అరగంట తర్వాత తాగాలి. ఈ జ్యూస్ కాలేయాన్ని శుభ్రపరచడంలో అద్బుతంగా పనిచేస్తుంది.
ఇదేకాకుండా కిస్మస్, ఎండుద్రాక్షని నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తాగినా కూడా కాలేయం శుభ్రపడుతుంది. గ్రీన్ టీ, ఆపిల్ సిడార్ వెనిగర్ కూడా సహజంగా లివర్ ను శుభ్రపరచడంలో సహాయపడుతాయి. వారంలో ఒకసారైనా పాలకూర వంటి ఆకకూరలు, బీట్రూట్, కివీ, ఆరెంజ్ వంటి విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడంవలన కాలేయ ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు.
Excellent