16 Ways to Make Hair Grow Faster

జుట్టు పెరగట్లేదు అన్న వాళ్ళు ఒకసారి ఈ ప్యాక్ ట్రై చేసి చూడండి

ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల వలన జుట్టు రాలడం సమస్య చాలా ఎక్కువగా ఉంది. పొల్యూషన్, విటమిన్స్ లోపం, అనారోగ్య సమస్యలు జుట్టు రాలడానికి ప్రధాన కారణం. జుట్టు రాలడం తగ్గించుకోవడానికి  మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ మరియు మందులను కూడా ఉపయోగిస్తారు. కానీ వీటిలో కెమికల్స్ ఉండటం వలన అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.  ఎటువంటి కెమికల్స్ లేకుండా కేవలం ఉండే వాటితో జుట్టు కు కావాల్సిన పోషకాలు అందించే చిట్కాలు చాలా ఉన్నాయి.

   వాటిలో ఒక చిట్కా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ చిట్కా ఏంటి అంటే ఈ రెండు పదార్ధాలతో హెయిర్ ప్యాక్ తయారుచేసుకుని ఉపయోగించినట్లయితే జుట్టు రాలడం తగ్గుతుంది. ఎంత పలుచగా ఉండే జుట్టు అయినా సరే ఒత్తుగా పెరుగుతుంది. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని చిన్న కప్ తో కప్ బియ్యం వేసుకోవాలి. బియ్యం కడగాల్సిన అవసరం లేదు. దీనిలో రెండు గ్లాసుల నీళ్లు వేసుకుని  స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొంచెం వేడి అయ్యి పొంగు వచ్చే వరకు ఆగాలి. 

      తర్వాత ఒక బీట్రూట్ తీసుకుని పీల్ చేసి మెత్తగా తురుముకుని ఆ తురుము కూడా గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి. బియ్యం మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.  కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత ఏదైనా క్లాత్ లేదా టీ వడపోసుకునే దానితో వడకట్టుకోవాలి. తర్వాత ఈ నీటితో జుట్టు కుదుళ్ళలో అప్లై చేసి ఒక పది నిముషాల పాటు మస్సాజ్ చేసుకోవాలి. ఒక అరగంట ఆరనివ్వాలి. తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూ లేదా శీకాకాయ్ లేదా కుంకుడు కాయలతో తల స్నానం చేయాలి.

      ఈ నీళ్లు చిక్కగా ఉండటం వలన జుట్టు కుదుళ్లకు బాగా పడుతుంది. బియ్యంలో ఉండే విటమిన్స్ జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఈ ప్యాక్ అప్లై చేయడం వలన చుండ్రు, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు తగ్గుతాయి. జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఇంక నా జుట్టు పెరగదు అనుకున్న వారు కూడా ఒకసారి ఈ ప్యాక్ అప్లై చేసినట్లయితే జుట్టు చాలా పొడవుగా పెరుగుతుంది.  బీట్రూట్లో ఆంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వలన చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ ప్యాక్ ఉపయోగించడం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

Leave a Comment

error: Content is protected !!