18 Effective Ayurvedic Face Packs to Treat Your Skin

7రోజుల ఛాలెంజ్ తీసుకోండి. ఎలాంటి చర్మం అయినా తెల్లగా, స్మూత్గా మారడం కాయం.

చర్మం కాంతివంతంగా, అందంగా ఉండడానికి మనం ఇప్పుడు ఏడు రోజులు చాలెంజ్ తీసుకోబోతున్నాం. ఇప్పుడు చెప్పబోయే ఫేస్ ప్యాక్ కనీసం ఏడు రోజుల పాటు ఉపయోగించడం వల్ల ముఖంపై ఉండే మృతకణాలు తొలగిపోయి ముఖం అందంగా తయారవడం కాయం. అన్ని నాచురల్ రెమిడీస్ కావడం వలన చర్మ రంగును తేలిక పరిచి చర్మం మెరిసేలా చేయడంలో ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. దాని కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు, వాటితో చిట్కా ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

 ఒక గ్లాసు తీసుకుని అందులో రెండు స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. శనగ పిండి ముఖంపై ఉండే మృతకణాలను తొలగించడంలో, చర్మ రంగును తేలిక పరచడంలో చాలా బాగా పనిచేస్తుంది. తరువాత మీది జిడ్డు చర్మం అయితే ఒక రెండు స్పూన్లు లేకపోతే ఒక స్పూన్ ముల్తాని మట్టి వేసుకోవాలి. ముల్తానీ జిడ్డును తొలగించి మొటిమలు రాకుండా అడ్డుకుంటుంది. తర్వాత కస్తూరి పసుపు రెండు స్పూన్లు, చందనం రెండు స్పూన్లు వేసుకోవాలి. చందనం ముఖాన్ని చల్లబరచి మొటిమలు, మచ్చలు, నల్లదనాన్ని తగ్గిస్తుంది. కస్తూరి పసుపు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుతో ఫంగల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కలుగకుండా అడ్డుకుంటుంది. 

చర్మాన్ని తేలిక పరచడంలో ఇవన్నీ చాలా బాగా పనిచేస్తాయి. వీటన్నింటిని బాటిల్లో వేసి  బాగా మిక్స్ చేయాలి. తరువాత రోజు మీరు స్నానానికి వెళ్ళే ముందు లేదా మొఖం కడుక్కునే ముందు ఒక స్పూన్ లేదా రెండు స్పూన్ల మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి నీటితో కలిపి ముఖానికి నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఐదు నిమిషాల పాటు ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.  ఇలా రోజూ చేయడం వల్ల మొఖం అందంగా, బ్రైట్గా  ఉంటుంది. ఈ టిప్ ను కనీసం  ఏడు రోజులు పాటు ప్రయత్నించి చూడండి. మీ స్కిన్ అందంగా మారడం ఖాయం. ఇలా స్క్రబ్  చేయడం ముఖానికి రక్తప్రసరణ కూడా మెరుగవుతుంది. చర్మం మంచిరంగును సొంతం చేసుకుంటుంది.

Leave a Comment

error: Content is protected !!