పల్లెటూరు అమ్మాయిలు జడ పొడవుగా ఒత్తుగా ఉంటుంది. అలాగే మీ జడ కూడా పొడవుగా ఒత్తుగా అవ్వాలంటే ఈ చిట్కా ఒకసారి ట్రై చేసి చూడండి. దీని కోసం మనం ముందుగా మందార పువ్వులు తెచ్చి పెట్టుకోవాలి. మందార పూలు దొరకవు అనుకున్నవారు హైబిస్కస్ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు. మనం రోజూ ఇంట్లో వండుకునే బియ్యం ఒక గ్లాసు తీసుకుని శుభ్రంగా కడిగి 2గ్లాసుల నీళ్లు వేసి ఒక గంట నాబెట్టుకోవాలి. తర్వాత 10 మందార పువ్వులు తొడిమలు తీసి నానబెట్టుకున్న బియ్యంలో రేఖలు విడదీసి వేసుకోవాలి.
వీటిని చేతితో క్రష్ చేసి మెత్తగా చేసుకోవాలి చేతులతో చేసుకోలేకపోతున్నాం అనేవారు మిక్సీ పట్టుకోవచ్చు. తర్వాత కలబంద మట్ట తీసుకుని శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ తీసుకుని మందార పువ్వులతో పాటు క్రష్ చేసుకోవాలి. అలోవెరా జెల్ నాచురల్ ది వద్దు అనుకున్నవారు మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ కూడా ఉపయోగించవచ్చు. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక పలుచటి క్లోత్ తీసుకుని వడకట్టుకోవాలి. దీనిలో ఒక చెంచా కాస్టర్ ఆయిల్ కలుపుకోవాలి.
కాస్టర్ ఆయిల్ వద్దు అనుకున్నవాళ్ళు కొబ్బరి నూనె వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకోవడం ఇష్టం లేనివారు ఇలా డైరెక్టుగా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి 20 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమం జెల్ లాగా ఉంటుంది. దీనిని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. తర్వాత 5 నిముషాల పాటు మస్సాజ్ చేసుకోవాలి. మస్సాజ్ చేసుకోవడం వలన బ్లడ్ సర్క్యూలేషన్ బాగా జరిగి జుట్టు రాలడం తగ్గి కుదుళ్ళు బలంగా అవుతాయి. అప్లై చేసుకుని 30నిముషాల పాటు అలా వదిలేసి తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూ లేదా కుంకుడు కాయ కానీ శీకాకాయతో తల స్నానం చేయాలి.
ఇలా వారానికి రెండు రెండుసార్లు చేయడం వలన జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. బట్టతల వచ్చిన వాళ్ళకి తిరిగి జుట్టు వస్తుంది. ఇది నాచురల్ రెమెడీ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ రెమెడీ ఆడవారు, మగవారు కూడా ఉపయోగించుకోవచ్చు. పల్లెటూరి అమ్మాయిల పొడుగు జడ రహస్యం ఇదే. మీరు కూడా ఈ రెమెడీ తెలుసుకున్నారు కదా ట్రై చేయండి. మీ జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.