క్రిస్టల్ క్లియర్ స్కిన్ టీవీ లో ఆ పదం వినిపించే ఏ యాడ్ కైనా మహిళలు ఆకర్షితులు అవుతారు. కొందరు వెంటనే ఆ ఉత్పత్తిని కొనుగోలు చేసి వీడటం మొదలు పెడతారు. ఫలితాన్ని చూసుకుని అన్నిటిలాగే ఇది కూడా మాటల ఊట అంతే అనుకుని వృధా అయిన డబ్బులు గురించి కన్నా తమ మోములో మెరుపు రాలేదే అని బెంగపడుతుంటారు. 70% మంది మహిళలు ఇలాంటి అనుభవాలు చూస్తూనే ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది.
అందం ఖరీదైన ఉత్పత్తులతోనే సాధ్యమని విషయాన్ని మొదట బుర్రలో నుండి తీసేస్తే మన చుట్టూ ఎన్నో గొప్ప వనరులు ఉన్నాయి. తక్కువ ఖరీదులో, మన వంటింట్లో ఎన్నో అమూల్యమైన వనరులు ఉన్నాయి. వాటిని ఉపయోగించి ముఖాన్ని ముత్యంలా మెరిపించుకునే రెండు రహస్యమైన ఫేస్ ప్యాక్ లు మీకోసం మరి చదవండి.
గోల్డెన్ ఫేస్ ప్యాక్….
గోల్డెన్ అంటే బంగారు కలపనవసరం లేదండి. మన వంటింట్లో ఆరోగ్యాన్ని కాపాడే బంగారమంత విలువైనది పసుపు. మరి పసుపుతో ఫేస్ పాక్ ఎలానో చూద్దాం.
కావలసిన పదార్థాలు
- పసుపు రెండు స్పూన్లు
- ఒక నిమ్మకాయ నుండి తీసిన రసం.
రెండింటిని కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి అరిపోయేవరకు ఉండాలి. ఆరిపోయిన తరువాత సాధారణ నీటితో శుభ్రజం చేసుకోవాలి.
ఇందులో పసుపు యాంటీ బాక్టీరియల్ గా పని చేస్తుంది. నిమ్మరసం సహజ బ్లీచింగ్ ఏజెంట్ గా పని చేస్తుంది. ఈ ఫేస్ పాక్ ను వారం లో రెండు సార్లు ఉపయోగించవచ్చు. మొహం మీద మచ్చలు, మొటిమలు, అవాంఛిత రొమాలను తొలగించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ ఫేస్ ప్యాక్.
స్కిన్ గ్లో ఫేస్ పాక్
పేరులో ఉన్నట్టే ముఖాన్ని ప్రకాశవంతంగా చేయడంలో ఇది అత్యుత్తమమైనది. చర్మానికి కాంతిని చేకూర్చి మెరుపును తీసుకొస్తుంది.
కావలసిన పదార్థాలు
- శనగపిండి – స్పూన్
- పసుపు – స్పూన్
- పెరుగు – స్పూన్
- తేనె- స్పూన్
పై నాలుగు పదార్థాలు బాగా మిక్స్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకుని సుమారు పదహైదు నిమిషాల పాటు ఉండనివ్వాలి. బాగా ఆరిపోయిన తరువాత మెల్లిగా రుద్దుతూ కొద్దీ కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మసాజ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మీద మృత కణాలు తొలగిపోతాయి.
శనగపిండి సహజమైన క్లీనింగ్ ఏజెంట్ గా…..
నిమ్మరసం బ్లీచింగ్ ఏజెంట్ గా…….
పెరుగు సహజమైన మాయిశ్చరైజర్ గా…..
తేనె చర్మానికి తేమను, మృధుత్వాన్ని అందించే వనరుగా ఉపయోగపడతాయి.
పైవన్నీ సహజమైనవే కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందరూ నిరభ్యరంతంగా ఉపయోగించవచ్చు. కేవలం రెండు సార్లు ఉపయోగించడంలోనే గొప్ప మార్పు కనబడుతుంది.
చివరగా……
అందాన్ని కాపాడుకోవడం, చేజారిన తరువాత తిరిగి పొందడం కష్టమైనదే అయినా కాసింత ఓపిక పడితే సులువుగానే పొందొచ్చు. అందుకే మరి ఖరీదైన ఉత్పత్తులే అందాన్ని ఇస్తాయని అనుకోవడం పొరపాటు సుమా!!