20 Best Homemade Hair Packs

ఈ నూనె రాయడానికి ముందు రాసిన తర్వాత ఒకసారి జుట్టును కొలుచుకొని చూడండి తేడా మీరే గమనిస్తారు

ప్రస్తుతం వాతావరణంలో ఉన్న కాలుష్యం, మనం తీసుకున్న ఆహారం, శరీరంలో ఉన్న ఆరోగ్య సమస్యలు వంటి కారణాల వల్ల జుట్టు రాలడం సమస్య చాలా ఎక్కువగా ఉంది. జుట్టు ఒత్తుగా  ఉన్న వారికి జుట్టు మొత్తం  సన్నగా తోక లాగా అయిపోతుంది. జుట్టు రాలడం తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు. వీటిలో కెమికల్స్  ఉండటం వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇంక మాకు జుట్టు పెరగదు ఇంకా ఏమి చేసిన  అనుకునే వారు ఒకసారి ఈ నూనెను రాసి చూడండి. 

    జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. దీని కోసం ముందుగా ఒక కడాయి తీసుకుని రెండు చెంచాల ఎండు ఉసిరి కాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి జుట్టు రాలడం తగ్గించి  జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడంలో  సహాయపడుతుంది. తెల్ల వెంట్రుకలు తగ్గించడంలో కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది.  ఉసిరికాయలు సీజన్ కానప్పుడు   ఎండబెట్టిన కాయలను ఉపయోగిస్తారు. ఇవి ఆయుర్వేద షాపుల్లో లభిస్తాయి. తర్వాత  రెండు చెంచాల కలోంజీ విత్తనాలు వేసుకోవాలి.  

        కలోంజీ విత్తనాలు జుట్టు రాలడం తగ్గించే కొత్త  జుట్టు రావడంలో బాగా ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు నల్లగా, ఒత్తుగా పెరగడానికి సహాయపడుతాయి. తర్వాత దీనిలో ఒక కప్పు కొబ్బరి నూనె వేసుకొని ఉసిరికాయ  ముక్కలు రంగు మారేవరకు మరగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని  నూనె  చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత నూనె  వడ కట్టుకొని ఏదైనా గాజు సీసాలో  స్టోర్ చేసుకోవాలి. ఈ నూనెను  ఒక సారి తయారు చేసుకుని నెల వరకు ఉపయోగించుకోవచ్చు. నూనె  తలకు అప్లై చేసుకునే ముందు గోరువెచ్చగా వేడి చేసుకుని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి.

          అప్లై చేసిన తర్వాత ఐదు నుండి పది నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. నూనె  రాసిన తర్వాత ఒక గంట ఉండనివ్వాలి. తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఇంక నాకు జుట్టు పెరగదు అనుకున్న వారు ఒకసారి ఈ నూనె రాయండి. ఒక నెల రోజులు ఉపయోగించిన  తర్వాత మీరు ఉపయోగించడానికి ముందు మరియు తర్వాత జుట్టు ఎంత పొడవు ఉందో చూడండి.  రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతారు.

Leave a Comment

error: Content is protected !!