అందరికీ అవాంఛిత రోమాల సమస్య ఎక్కువగా ఉంది. ముఖంపై ఎక్కడపడితే అక్కడ అవాంచితరోమాలు ఉండటం వలన నలుగురిలోకి వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అవాంచిత రోమాలు తగ్గించుకోవడానికి పార్లర్కు వెళ్లి గంటల సమయం కూర్చుని సమయం మరియు డబ్బు కూడా వృధా చేసుకుంటూ ఉంటారు. ఇక నుండి పార్లర్కి వెళ్ళనవసరం లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఇంట్లోనే అవాంచిత రోమాలను తొలగించుకోవచ్చు.
ఈ చిట్కా ట్రై చేస్తే అవాంచిత రోమాలు శాశ్వతంగా పోతాయి. దీనికోసం ముందుగా మనం ఒక బాబు తీసుకొని మూడు చెంచాల పంచదార వేసుకోవాలి. దీనిలో అరగ్లాసు నీళ్ళు వేసుకొని ఒక నిమ్మకాయ రసం తీసుకోవాలి. దీనిని స్టవ్ మీద పెట్టి బాగా తీగ పాకం వచ్చేంతవరకు ఉండనివ్వాలి. పాకం వచ్చేసరికి రంగు కూడా మారుతుంది. ఒక ప్లేట్ లో నీళ్ళు వేసి పాకం చిన్న ఉండేలాగా చేసి ప్లేట్లో వేసినప్పుడు టప్ మని శబ్దం వస్తోంది. అలా వచ్చినట్లయితే పాకం అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వాలి.
తర్వాత దీని కోసం ఒక జ్యూట్ బ్యాగ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకొని అవాంచిత రోమాలు తొలగించుకోవాల్సిన ప్లేస్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత జ్యూట్ బ్యాగ్ పీస్ దాని మీద పెట్టి గట్టిగా నొక్కి పెట్టాలి. తర్వాత స్లోగా జూట్ బ్యాగ్ అంచుల నుండి నెమ్మదిగా లాగాలి. ఇలా మన అవాంఛితరోమాలు తొలగించవలసిన ప్లేస్ లో అప్లై చేసి ఈ పేపర్ బ్యాగ్ తొలగించినట్లయితే అవాంఛితరోమాలు లోపల్నుండి తొలగిపోతాయి. ఈ చిత్రాలు ఒక సారి ట్రై చేసి నాకు కావాల్సింది రోమాలు శాశ్వతంగా మాయం అయిపోతాయి.
ఇలా అవాంచిత రోమాలు తొలగించుకున్న తర్వాత వాసెలిన్ అప్లై చేసుకోవాలి. వాసెలిన్ లేకపోతే కోకోనట్ ఆయిల్ లేదా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు. ఈ చిట్కాను అస్తమానం టైప్ చేయాల్సిన అవసరం లేదు పార్లర్కు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఈజీగా ఇంట్లో ఉండే వాటితో అవాంచిత రోమాలను తొలగించవచ్చు. ఈ చిట్కా మీకు కూడా అవసరం అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా పని చేస్తుంది.