మనలో చాలా మంది ఇళ్లలో చిన్న మొక్క వేస్తే చాలు దానందట అదే పెరుగుతూ ఉంటుంది కలబంద. ఎక్కువ నీరు పొయ్యకపోయినా ఎలాంటి పోషణ చెయ్యకపోయినా బతికే ఎడారి మొక్క ఇది. కలబంద ఓ ఔషధ మొక్క. సౌందర్య ఉత్పత్తులు, తినుబండారాలు, చర్మ సంబంధిత ప్రొడక్ట్స్ లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇంకా కలబందతో అంతకుమించిన మరెన్నో ప్రయోజనాలున్నాయి.
సర్వరోగ నివారిణి ఈ కలబంద. దీని ప్రయోజనాలు చూద్దాం.
◆కలబందలో ఉండే గుజ్జు అధికశాతం నీటితోనే తయారవుతుంది. కొన్ని వందల శతాబ్దాలుగా కలబందను సంప్రదాయ ఔషధ మొక్కగా అన్ని విధాలుగా వాడుతున్నారు.
●ఇందులో గాయాలను అతి త్వరగా మాన్పించే గుణం, చర్మాన్ని సున్నితంగా అందంగా మార్చే లక్షణాలూ అనేకం ఉన్నాయి. వేడి వాతావరణంలో పెరిగే ఈ మొక్కను మనం నీడలో, ఎండలో ఎక్కడైనా మన పరిస్థితులకు అనుగుణంగా సంతోషంగా పెంచుకోవచ్చు.
◆కలబంద గుజ్జునూ,కొబ్బరి నూనెనూ కలిపి తలకు పట్టించి మాడుకు తగిలేలా జుట్టు కుదుళ్ల వరకు మర్దన చేస్తే చాలు. జుట్టు బాగవుతుంది. చుండ్రు వదిలిపోతుంది. తలలోని మృత కణాలు తొలగిపోయి. జుట్టు మెరుస్తూ, సిల్కీ గా స్మూత్‌గా మారిపోతుంది. జుట్టు ఎక్కువగా రాలిపోయేవారు జుట్టు చిన్న వయసులోనే తెల్లబడే వారు ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
◆కలబందలోని పోషకాలు, ఎంజైములు, ఖనిజాలు ఇవన్నీ మనలో అధిక బరువును తగ్గించేవే. ప్రతి రోజూ గ్లాస్ గోరువెచ్చని నీటిలో రెండు టీ స్పూన్స్ కలబంద గుజ్జును కలిపి తాగేయాలి. కడుపులోని కొవ్వు, చెడు పదార్థాలు, పేగులకు అంటుకుపోయే మలినాలు వంటివన్నీ మొత్తం శుభ్రం అయిపోతాయి. ఉత్తిగా జ్యూస్ తాగలేమనుకునేవారు అందులో కాస్త నిమ్మరసం, తేనె లాంటివి కలుపుకుంటే రుచిగా ఉంటుంది. సులువుగా తాగగలుగుతారు.
◆చర్మానికి కలబంద చేసే మేలు అంతా ఇంతా కాదు. కాలిన గాయాలు, వాపులకు కలబంద గుజ్జును రాసుకోవాలి. అలాగే స్నానం చేసే ముందు కలబంద గుజ్జును చర్మం అంతటికీ సబ్బు రాసుకున్నట్లు వంటికి పట్టించుకుని. ఓ ఐదు నిమిషాల తర్వాత స్నానం చేసేస్తే చాలు. ఇక సబ్బుతో అవసరం లేకుండానే. చర్మం పరిశుభ్రం అయిపోతుంది. అంతేకాదు చర్మంపై ఉండే బ్యాక్టీరియా, ఇతరత్రా సూక్ష్మక్రిములన్నీ చనిపోతాయి. చర్మం మిలమిల మెరుస్తూ, కోమలంగా సున్నితంగా మారుతుంది.
◆రక్తపోటు మధుమేహం వంటివి అదుపులో ఉండేందుకు కూడా కలబంద బాగా ఉపయోగ పడుతుంది. రోజూకు రెండు టేబుల్ స్పూన్ల కలబంద జ్యూస్ తాగితే, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు మంచి మందులా పని చేస్తుంది.
◆మనకి చర్మం తెగినా, మండినా, కాలినా, వాపు వచ్చినా, కందినా, పొడిబారినా… ఇలా చర్మానికి ఏం జరిగినా, ఆ ప్రదేశంలో కలబంద గుజ్జును రాస్తే ఫలితం క్షణాల్లో కనిపిస్తుంది. గుజ్జును రాసిన తర్వాత ఆ ప్రదేశం గట్టిగా అయిపోయినట్లు అనిపిస్తుంది. కారణం కలబంద గుజ్జు అక్కడి చర్మ కణాలకు బలం ఇస్తుంది.
చివరగా….
ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉండటం వల్లే ఇప్పుడు అన్ని సౌందర్య కంపెనీలూ అలోవెరా పేస్ట్, అలోవెరా క్రీమ్, అలోవెరా సోప్, అలోవెరా కండీషనర్… ఇలా వందల సౌందర్యఉత్పత్తులను తమ తమ బ్రాండ్ ల పేరుతో తయారుచేస్తున్నాయి. బోల్డన్ని లాభాలు గడిస్తున్నయి. కాబట్టి మనకు అందుబాటులో ఉండే తాజా కలబంధను తప్పక వాడుకుందాం.
ధన్యవాదములు
మంచి విషయం అందింవారు