3 best home beauty tips for white hair to black hair

మూడు చిట్కాలతో తెల్లజుట్టును తరిమేద్దామా….

ముప్పయ్యేళ్ళ వయసు కూడా రాకనే అంతకు రెట్టింపు సంఖ్యలో తెల్ల వెంట్రుకలతో ఇబ్బది పడిపోతున్నారు ప్రస్తుత యువత. కారణాలు ఎన్నున్నా మనోవ్యధ మాత్రం మనసులో నిండిపోతుంది. తెల్లజుట్టును నివారించుకోవడానికి  మార్కెట్ లో లభ్యమయ్యే ప్రతి షాంపూ ను, హెయిర్ ఆయిల్ ను వాడుతూ ఫలితం రాక ఇంకా నీరసపడిపోతుంటారు. తెల్లజుట్టు నివరించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు కావాల్సిందల్లా కాసింత ఓపిక. ఫలితాన్ని వెంటనే ఆశించడమంటే పిల్లాడు పుట్టగానే పరిగెత్తాలని అనుకోవడమే. చెప్పబోయే మూడు చిట్కాలను కాసింత ఓర్పుతో పాటిస్తే మీ జుట్టు నల్లబడటాన్ని ఎవరూ ఆపలేరు. మరి చూడండి ఆ మూడు చిట్కాలేంటో 

జుట్టుకు నూనె 

జుట్టు సంరక్షణలో భాగమైన నూనె విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బయట దొరికే రకరకాల నూనెలు జుట్టుకు చేటు చేసేవే. అందుకే చెబుతున్నా పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయకుండా గానుగలో ఆడించిన స్వచ్ఛమైన కొబ్బరినూనె తెచ్చుకుని, కరివేపాకు, గోరింట, మందారం, మెంతులు మొదలైనవి వేసి కాచి చల్లార్చి ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. జుట్టుకు నూనె పెట్టేటప్పుడు కొద్దిగా వేడి చేసి మెల్లిగా కుదుళ్లకు పట్టేలా పెట్టుకోవాలి. కనీసం 5 నిమిషాల పాటు మర్దనా చేసుకోవాలి.  వారంలో మూడు సార్లు జుట్టుకు నూనె పెట్టడం మరవకండి. జుట్టును ఆరోగ్యంగా మృదువుగా ఉంచుతుంది. కుదుళ్లను దృఢ పరుస్తుంది. రక్తప్రసరణ బాగుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

హెయిర్ పాక్

కాలుష్యపు కాలంలో జుట్టును షాంపూ వేసి రుద్ది రుద్ది కడగడం వల్ల ఉన్న మృదుత్వం పోయి జుట్టు పొడిబారి కళావిహీనమై టెంకాయ పీచులా అవుతుంది. జుట్టుకు తగిన తేమ అందుతుంటేనే అది ఆరోగ్యముగా ఉంటుంది. అందుకే వారానికి ఒకసారి గోరింట, మందారం, కరివేపాకు పెరుగు మిశ్రమం వీటిలో ఏదో ఒకటి వారంలో ఒకసారి తలకు పాక్ వేసుకోవాలి. కనీసం ఒక గంట పాటు ఉంచుకుని తరువాత గాఢత లేని షాంపూ లేక కుంకుడుకాయతో తలంటు పోసుకోవాలి.  కండిషనర్లు, కాకరకాయలు ఎందుకండి మన అమ్మలు, ఒకప్పటి మన బామ్మలు ఏ కండిషనర్ ను వాడలేదు అనే విషయం గుర్తు పెట్టుకోవాలి.

పోషణ

జుట్టుకు పోషణ అంటే నూనె రూపంలోనో హెయిర్ పాక్ రూపం లోనో అందించడం కాదు. జుట్టు పెరుగుదలకు మన శరీరంలో తగిన పోషకాలు ఉండాలి. అపుడే పెరుగుదల సాధ్యం. అందుకోసమే ఈ చిట్కా. మీరు సేకరించుకున్నా లేక బయట కొన్నా గుంటగరం లేదా భృంగరాజ్ చూర్ణాన్ని సంపాదించుకోవాలి. ఈ చూర్ణానికి సమానంగా పటికబెల్లం లేదా కండచెక్కెర తీసుకుని బాగా కలిసిపోయేలా మెత్తగా పొడిచేసుకుని ఒక టైట్ కంటైనర్ లో నిల్వచేసుకోవాలి. ఈ పొడిని రోజు ఏదో ఒక సమయంలో అరస్పూన్ మోతాదుగా నోట్లో వేసుకుని చప్పరించి తినాలి. ఇది చేసే మ్యాజిక్ ను స్వానుభవంతో తెల్సుకోవలసిందే. జుట్టును అతి తక్కువ సమయంలో  నల్లగా తుమ్మెద రెక్కల్లా మార్చేస్తుంది ఇది. 15 నుండి 20 రోజుల్లోపు తేడాను మీరే గమనిస్తారు. 

చివరగా……

పైన చెప్పుకున్న మూడు చిట్కాలను పాటిస్తే జుట్టు అరవై ఏళ్ళు వచ్చినా తెల్లబడకుండా  ఉంటుంది. కేవలం మాటల్లో కాదు ఒకసారి వాడి అనుభవపూర్వకంగా తెల్సుకోవలసిందే. ఓపికతో ఫలితం 100% గ్యారెంటీ.

Leave a Comment

error: Content is protected !!