3-Healthy-Foods-Every-Women-Should-Eat-At-Daily-Routine

ప్రతి మహిళ తప్పక తీసుకోవలసిన మూడు పదార్థాల ఆరోగ్య రహస్యం మీలో ఎంతమందికి తెలుసు.

అభివృద్ధి చెందుతున్న కాలం కు అనుగుణంగా మహిళలు కూడా  తమ ప్రతిభను నిరూపించుకుంటూ సాగిపోతున్నారు. అటు తల్లిగా, భార్యగా, ఇటు వృత్తి, ఉద్యోగస్తురాలుగా, తమకు నచ్చిన రంగంలో తమదైన  ముద్ర వేస్తున్నారు. ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మహిళలు మానసికంగా ను శారీరకంగానూ కూడా బలహీనం అవుతున్నారు. మానసికంగా బలంగా ఉన్నా కూడా శారీరక అలసట, నీరసం, బలహీనత తో బాధపడుతున్నారు.

అందుకే ప్రతి మహిళ తప్పక తీసుకోవలసిన మూడు పదార్థాలు ఉన్నాయి. ఆయుర్వేదపరంగా ఇవి చాలా ఉత్తమమైనవనే నిర్ధారణ కూడా ఉంది. వీటిని తీసుకోవడం వల్ల మహిళలు తమ రోజువారీ జీవితంలో దృఢమవుతారనే ఎన్నో రుజువులు కూడా నిరూపించబడ్డాయ్. మరింకెందుకు ఆలస్యం ముచ్చటైన ఆ  రహస్య పదర్థాల గురించి బట్టబయలు చేస్తున్నా. చదివిన తరువాత మీరు కూడా తప్పక ఆమోదం తెలిపి తీరతారు. చదవండి మరి.

నువ్వులు

◆మహిళ జీవితానికి నువ్వులకు చాలా గొప్ప అనుబంధం ఉంటుంది.  కాల్షియం సమృద్ధిగా ఉన్న నువ్వులు మహిళల జీవితంలో నవ్వుల వాన కురిపిస్తాయనడం లో సందేహమే లేదు.

◆ఆడపిల్ల పుట్టిన తరువాత 8 ఏళ్ల వయసు నుండి వృద్ధాప్యం లో ఉన్న 80 ఏళ్ల ముసలమ్మ వరకు ప్రతి ఒక్కరు నువ్వులను నిరభ్యరంతంగా తీసుకోవచ్చు. 

◆నువ్వులలో ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని సంరక్షించే మంచి కొలెస్ట్రాల్ ను అందిస్తాయి.

◆వీటిని తరచుగా ఆహారంలో భాగం చేసుకుంటూ ఉంటే  శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలు సమతుల్యంగా ఉంటాయి.  అంతేకాదు నడుము, శరీరంలో ఎముకలు, కీళ్లు వంటివి దృడంగా తయరవుతాయి. 

శతావరి

◆శతావరి ఒక తీగజాతికి చెందిన మొక్క. శతావరి  చూర్ణం ఆయుర్వేదంలో ఉత్తమంగా చెప్పబడింది. రోగం పేరు తెలియని జబ్బులకు కూడా శతావరి చూర్ణం వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

◆ముఖ్యంగా శతావరి మహిళల్లో ఋతు సమస్యలను ఎదుర్కోవడంలో చక్కగా పని చేస్తుంది. 

◆మహిళల గర్భాశయంలో ఏర్పడే నీటి తిత్తుల నివారణలో శతావరి గొప్పగా పనిచేస్తుంది.

◆అన్ని రకాల వయసుల వారిలో హార్మోన్ల అసమతుల్యతను అరికడుతుంది.  ముఖ్యంగా 45 ఏళ్ల తరువాత ప్రతి మహిళకు ఎదురయ్యే మెనోపాజ్ సమస్యను సులువుగా దాటడంలో సహకరిస్తుంది.

మంజిష్ట

◆మంజిష్ట మహిళల శరీరంలో లింప్ గ్రంధుల పనితీరును పర్యవేక్షిస్తుంది.

◆సాధారణంగా మహిళల్లో ఎక్కువ శాతం మంది ఇబ్బంది పడుతున్న అనిమియాను అరికట్టడంలో మంజిష్ట ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

◆కలుషితమయిన రక్తాన్ని శుద్ధి చేయడానికి ఇది ఉత్తమ ఎంపిక అనడంలో అతిశయోక్తి లేదు. రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా రక్తనాళాల పనితీరు మెరుగయ్యి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో పరోక్షంగా సహాయపడుతుంది. 

చివరగా…..

పైన చెప్పుకున్న మూడింటిలో…..

నువ్వులు శరీరాన్ని దృడంగా ఉంచడంలో….

శతావరి హార్మోన్ల అసమతుల్యత నివారించడంలో….

మంజిష్ట శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి ఆరోగ్యంగా ఉంచడంలో….

ఇలా మూడు, మూడు విధాలుగా పని చేసి శరీరాన్ని దృడంగా ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి మహిళలూ…. ఈ మూడింటిని అసలు మిస్సవకండి.

Leave a Comment

error: Content is protected !!