అందంగా ఉండాలన్న కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది.. కొందరికి అందమైన కళ్ళు ఉంటె, మరి కొందరికి అందమైన ముఖం ఉంటుంది… ఇలా అందాన్ని వర్ణిస్తుంటాము. కాని అందమైన చర్మమే అసలైన అందమని నిపుణుల అభిప్రాయం. ఈ చర్మ సౌందర్యం సొంతం కావాలంటే, కోరిక ఒకటే ఉంటె సరిపోదు.. చర్మం పైన శ్రద్ధ వహించాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. బాహ్య సౌందర్యం కావాలంటే.. అంతర్గతంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి.
ఇది ఎలా వస్తుంది? మంచి ఆహరం, ఆనందంగా ఉండటం, సరైన సమయానికి పడుకోవడం.. వ్యాయామం చేయడం.. సరిపడ నీళ్ళను త్రాగడం, మనస్సుని ప్రశాంతంగా ఉంచడం ఇలాంటివన్నీ ఆచరిస్తే.. చాలావరకు మీ చర్మం కాంతివంతంగా, మెరుస్తూ ఉంటుంది. అయితే.. ఇంట్లో ఆచరించదగిన కొన్ని చిట్కాలు పాటిస్తే మరింత ప్రయోజనం పొందవచ్చు.

1. రెండు పూటలు స్నానమాచరించడం:
గోరువెచ్చని నీటితోనే ఉదయం, సాయంత్రం స్నానం చేయాలి. శరీరంలో పేరుకున్న మలినం, మురుకి పోయి శుభ్రంగా ఉండాలంటే.. ఇలా చేయడం తప్పనిసరి. చర్మం కూడా మెరుస్తుంటుంది.

- దీని ముందు ఖరీదైన ఫేషియల్ కానీ ఫేస్ ప్యాక్ కానీ పనిచేయదు
- రాత్రి పూట ఇలా చేస్తే వద్దన్నా మీ జుట్టు పెరుగుతూనే ఉంటుంది
టమాటో రసం :
వారానికి రెండు, మూడు సార్లైనా ఈ టమాటో రసాన్ని ముఖానికి పట్టించి ఒక అరగంట ఉండనిచ్చి గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.. ఈ రసాన్ని మెడకు, చేతులకు, కూడా రాసుకోవచ్చు. బయట కాలుష్యానికి మీ చర్మం మొద్దు బారిపోవడం, వడిలిపోవడం, మురుకిపట్టడం జరుగుతుంది.. ఇలాంటప్పుడే టమాటో రసం ఒక వండర్ లా పనిచేస్తుంది.

3. పచ్చిపాలు:
ముఖానికి పట్టిన మురికిని తొలిగించడానికి పాలు బాగా ఉపకరిస్తాయి. రాత్రి పడుకోవడానికి ముందు పాలల్లో దూదిని ముంచి దానితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అనంతరం మాయిశ్చరైజర్ రాసుకోవాలి. చర్మ సౌందర్యాన్ని పరిరక్షించడంలో పాలు ఎంతో దోహదపడతాయి. చర్మం లోపల వరకు వెళ్లి మురికిని తొలిగించడమే కాకుండా..చర్మం మెరిసేలా చేస్తుంది.