ఒక వయసు వచ్చాక చర్మం తన మెరుపును పోగొట్టుకుంటుంది. చర్మంలో ఏర్పడే ముడతలు, చర్మం సాగే లక్షణాన్ని కోల్పోవడం లాంటివి జరగడంతో వృద్ధాప్యం వచ్చేసినట్టు అనిపించి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంది. ఇలా ముడతలు రావడం మొదలవగానే రకరకాల క్రీములు వాడేస్తుంటాం. కానీ వాటివలన ప్రయోజనాలకన్నా దుష్ప్రభవాలు ఎక్కువ. సహజంగా అందాన్ని కాపాడుకోవడానికి రుపాయి ఖర్చు పెట్టనవసరంలేని కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. అందం అనేది సహజంగా రావాలి. కృత్రిమ పద్థతుల వలన వచ్చే అందం ఇబ్బందులను కూడా తెస్తుంది. అందుకే ఈ చిట్కాలతో అందం పెంపొందించుకుందాం.మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి
నీరు ఎక్కువగా తాగితే అస్తమానం బాత్రూంకి వెళ్ళాలని నీటిని తాగడం తగ్గిస్తారు. ఆఫీసుల, కాలేజీలు, స్కూల్లకు వెళ్ళినప్పుడు అందరిముందు బాత్రూంకి వెళ్ళాలని , లేదా ఇన్పెక్షన్ వస్తాయని కూడా ఆలోచిస్తుంటారు. అందానికి మొదటి ఔషధం నీళ్ళే. నీళ్ళు సరిపడా తాగడంవలన అందంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఎండ, వాన, గాలి, కాలుష్యం నుండి రక్షిండానికి చర్మం చాలా అవసరం. అలాంటి చర్మాన్ని రక్షించడానికి నీళ్ళు చాలా అవసరం. నీటిని తాగడం తక్కువయినపుడు చర్మంకింద ఉండే ఎలాక్టిన్, కొలాజిన్ ఉంటాయి. అవి వాటి మధ్య ఉండే బాండింగ్‌ని కోల్పోతాయి. నీరు బాగా తాగడంవలన ఇది చర్మాన్ని ముడతలు పడనివ్వదు. చర్మాన్ని మృదువుగా ఉండేలా చేస్తుంది. రోజుకి నాలుగు లీటర్ల నీటిని తాగాలి. మగవారు ఎండలో తిరిగేవారు ఐదులీటర్ల వరకూ తాగాలి. చర్మం ఆరోగ్యంగా ఉండడానికి విటమిన్ సి, విటమిన్ ఏ కావాలి. స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ రావడానికి కూడా విటమిన్ సి లోపం కారణం.
మనం తీసుకునే ఆహారంలో జంక్ ఫుడ్, మసాలా, కేన్ ఫుడ్, వేడిచసుకుని తినే ఆహారంలో విటమిన్లు లోపిస్తాయి. ఎలాక్టిన్, కొలాజిన్ కి విటమిన్ సి కూడా అవసరం. రోజూ నీళ్ళు విటమిన్ సి అవసరం. రోజూ పండ్లు తినలేంకనుక కూరగాయల జ్యూస్ ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. క్రమంతప్పకుండా కమలా జ్యూస్, బత్తాయి, పైనాపిల్‌లో ఏదో ఒకటి రెండొందల గ్రాములు తాగండి. ఇవి సహజంగా అందాన్ని కాపాడతాయి. తర్వాత అందం ఆరోగ్యం ఎన్నేళ్ళైనా చెక్కుచెదరకుండా ఉండాలంటే ప్రూట్స్ తినండి. వాటితో పాటు పిస్తా, వాల్నట్స్, బాదం తినండి. వీటిలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది నట్స్లజ ఎక్కువగా తినండి. ఇవి అందుబాటులో లేనివారు నువ్వులు, పల్లీలు తినండి. వీటన్నింటిలో విటమిన్ ఇ, విటమిన్ సి ఐరన్ వంటివి పూర్తిగా లభిస్తాయి. త్వరగా భోజనం ముగించడం, సరైన నిద్ర, వ్యాయామంతోపాటు ఈ చిట్కాలు పాటిస్తూ అందం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.