కొంతమంది చిన్న వయసు అయినా సరే చర్మం ముడతలు పడి పోయి, చర్మం సాగిపోయి పెద్ద వాళ్ళ లాగా కనిపిస్తారు. ఫేస్ ప్యాక్ వంటివి తయారు చేసుకునే టైం లేక కొంతమంది మార్కెట్లో దొరికే రెడీమేడ్ క్రీమ్స్ ను అప్లై చేస్తారు. ఇవి అప్లై చేయడం వలన సమస్య ఇంకా పెరుగుతుంది. స్కిన్ డామేజ్ మొదలవుతుంది. చర్మంపై కెమికల్స్ ఉండే క్రీమ్ ను అప్లై చేయడం వల్ల చర్మం డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఇటువంటి గ్రీన్స్ లైసెన్స్ అప్లై చేయడం కంటే ఇంట్లో ఉండే వాటితో తక్కువ ఖర్చులో ఫేస్ ప్యాక్ లను తయారుచేసుకుని ఉపయోగించడం వలన మీ చర్మం అందంగా కాంతివంతంగా తయారవుతుంది.
ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇప్పుడు మనం 20 30 ఏళ్ల వయసులో 40 ఏళ్ల వయసు వారిలాగా చర్మం ముడతలు పడి పోయి కనిపిస్తుంది. మన చర్మం పై ముడతలు తగ్గించుకోవడానికి ఈ ప్యాక్ ఉపయోగించినట్లయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చర్మం పై ముడతలు అన్నీ పోయి చాలా యంగ్ గా కనిపిస్తారు. ముందుగా అవిసె గింజలను తీసుకొని కడాయిలో వేసి ఆరోమా స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. తీసుకొని రెండు చెంచాల అవిస గింజలు పొడిని వేసుకోవాలి. చర్మంపై ఉండే ముడతలు తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఒక నిమ్మకాయ దీపక్క తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటితో పాటు నిమ్మ తొక్కలను కూడా మెత్తగా మిక్సీ పట్టుకుని వడ కట్టుకొని అవిసె గింజల పొడిలో వేసుకోవాలి. ముఖంపై ఉండే ముడతలు స్కిన్ ఏ సమస్య ను తగ్గించడంలో సహాయపడుతుంది.
తర్వాత దీనిలో ఒక విటమిన్ క్యాప్సిల్ వేసుకోవాలి. ముఖంపై ఉండే ముడతలు తగ్గించి ముఖం కాంతివంతంగా చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఒక అర చెంచా రోజ్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవడానికి ముందు ముఖాన్ని శుభ్రంగా నీళ్లతో కడుక్కుని తడిలేకుండా తుడుచుకోవాలి. తరువాత కొంచెం రోజ్ వాటర్ ను ముఖంపై అప్లై చేసి ఇంటికి పోయిన తర్వాత ఈ ప్యాక్ ముఖంపై అప్లై చేసుకోవాలి. ఎప్పుడు అప్లై చేసినా కింద నుంచి పైకి అప్లై చేయాలి.
పైనుంచి కిందికి అప్లై చేయకూడదు. అప్లై చేసిన తర్వాత 45 నిమిషాల పాటు ఆరనివ్వాలి. కొంచెం రోజ్ వాటర్ స్ప్రే చేసి చేతితో స్క్రబ్ చేసుకొని ఫ్యాక్ రిమూవ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. వరుసగా ఆపకుండా ఏడు రోజుల పాటు చేయాలి. 7 రోజుల తర్వాత 3 రోజులు గ్యాప్ ఇచ్చి కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు లేదా మీకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు మాత్రమే చేసుకోవచ్చు. ఈ ప్యాక్ అప్లై చేయడం వల్ల ముడతలు తగ్గి ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది.