31 Fiber Rich Foods For Constipation

మనం తీసుకునే ఆహారంలో ఉండే పీచు పదార్థం గూర్చి ఆశ్చర్యపరిచే నిజాలు

మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, లవణాలు వీటితో పాటు పీచు కూడా ఉంటుంది. చాలామందికి పీచు ఉన్న ఆహారం వల్ల లాభమేంటి అంటే జీర్ణక్రియ సమర్థవంతంగా ఉంటుందని చెబుతారు తప్ప పీచు వల్ల పూర్తి స్థాయి ఉపయోగాలు మరియు దాని అవసరం గూర్చి చెప్పలేరు. అందుకే మనం ఆహారంలో పీచు లభించే పీచు వల్ల ఉపయోగాలు ఏమిటో చూద్దాం.

◆పీచు మన శరీరంలో ఉత్పన్నమయ్యే కొన్ని రకాల జబ్బులను అరికట్టడంలో గొప్పగా పనిచేస్తుంది.  పీచు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీర్ణకోశంలో ఆహార సరఫరా చురుగ్గా జరుగుతుంది.

◆మనం తీసుకునే ఆహారంలో కొవ్వులలో పైత్యాన్ని ప్రేరేపించే కారకాలు శరీరంలో కలిసిపోకుండా మలం, మరియు మూత్రం ద్వారా బయటకు పోయేలా చేయడంలో పీచు పదార్థాల పాత్ర ఎక్కువగా ఉంటుంది.

◆పీచు పదార్థాలు మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ స్థాయిలను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తూ రక్తనాళాలు గట్టిపడి మూసుకుపోకుండా ( కొవ్వు పదార్థాలు మరియు మలినాలు రక్తనాళాల్లో పెరుగుపోవడం వల్ల మూసుకుపోయి రక్తప్రసరణ కు ఆటంకం కలిగిస్తాయి) ఉండటంలో పీచు పదార్థాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

◆ప్రస్తుతకాలంలో   చాలామంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఇది వంశానుగతంగా వస్తుందని చాలామంది అంటారు. అయితే ఇలా వంశానుగతంగా వస్తున్నవారు తమ ఆహారంలో పీచును ఎక్కువగా చేర్చుకోవడం వల్ల మధుమేహ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.

◆పిత్తాశయంలో ఏర్పడే రాళ్లను అరికట్టడంలో పీచు పదార్థం ఎంతగానో సహాయపడుతుంది.  అలాగే పేగులలో కలిగే వత్తిడి వల్ల పేగులు పక్కకు జరిగి హెర్నియా వ్యాధికి లోనవుతుంది. అయితే పీచు పదార్థం పేగుల్లో కలిగే ఒత్తిడిని అరికట్టగలదు కాబట్టి హెర్నియా లాంటి సమస్యలు రాకుండా చేస్తుంది.

◆క్యాన్సర్ వ్యాధిని కలుగజేసే కార్సినోజినిక్  లను శరీరంలో ఉత్పత్తి కాకుండా నిరోధించడంలో పీచు పదార్థాలు సహకరిస్తాయి. 

పైన చెప్పుకున్న వాటి వల్ల మనం తీసుకునే ఆహారంలో అధికశాతం పీచు లేక నార గల ఆహార పదార్థాలను తీసుకోవడం అత్యుత్తమం. 

మన రోజువారీ ఆహారంలో పీచు సమృద్ధిగా మనకు అందాలంటే కింది ఆహారాలు తీసుకోవాలి.

◆ బియ్యం,గోధుమలు,రాగులు మొదలైనవాటిని పొట్టుతీయకుండా మరపట్టించి పిండిగా వాడుకోవాలి. అన్నాన్ని వండుకోవడానికి ముడిబియ్యాన్ని వాడటం ఉత్తమం.

◆పచ్చిగా తినేలా ఉన్న కూరగాయలను పచ్చిగా తీసుకోవడం ఉత్తమం. చాలావరకు కూరగాయలను తక్కువసేపు మూతపెట్టి ఉడికించి ఆహారంలో భాగం చేసుకోవాలి. దీనివల్ల ఆరోగ్యకరమైన పీచు మాత్రమే కాదు అందులోని విటమిన్లు కూడా నశించవు.

◆ చాలామంది పండ్ల రసాలు తాగడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే పండ్లను నేరుగా తినడం వల్ల ఎంతో గొప్ప పీచు శరీరానికి అందుతుంది. అంతేకాదు దంతాలను దృడంగా మారుస్తుంది కూడా.

◆పుచ్చకాయ, కర్భుజ వంటి పండ్లను కూడా నేరుగా తీసుకోవాలి వీటిలో ఎక్కువ శాతం నీరు తరువాత పీచు లభ్యమవుతాయి. 

◆వీలైనంతవరకు తాజాగా ఉన్నవాటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల పీచు స్థాయి సమృద్ధిగా ఉండటం మాత్రమే కాకుండా ఆరోగ్యవంతంగానూ ఉంటుంది.

చివరగా…….

పైన చెప్పుకున్న విషయాలను దృష్టిలో ఉంచుకుని రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా పీచును జోడించి తరువాత ఫలితాన్ని మీరే గమనించండి.తప్పకుండా ఆశ్చర్యపోవడం మీవంతవుతుంది.

Leave a Comment

error: Content is protected !!