ప్రతి ఒక్కరి జీవనశైలి మరియు ఆరోగ్య నాణ్యతల పైనే వారి జీవితకాలం ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యం తోనే దీర్ఘాయుష్షు సాధ్యమని అందరికి తెలిసినదే. అయితే ప్రస్తుత కాలంలో మనిషి సగటు జీవిత కాలం రాను రాను తగ్గిపోతోంది చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు, కాలానుగుణంగా సంక్రమిస్తున్న జబ్బులతో జీవితకాలం కూడా తగ్గిపోతోంది. అయితే దీర్ఘాయుష్షు కోసం ఇక్కడ చెప్పబోయే అద్భుతమైన సూత్రాలు పాటిస్తే మన జీవితకాలాన్ని పొడిగించుకోవచ్చు. మనకొచ్చే జబ్బులను తరిమి కొట్టవచ్చు. మరి దీర్ఘకాలిక మరియు ఆరోగ్యకరమైన జీవితానికి నాలుగు ఉత్తమమైన సూచనలు ఏమిటో చదవండి.
శరీర బరువు
ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడంలో శరీర బరువు ప్రముఖ పాత్ర వహిస్తుంది. బాడీ మాస్ ఇండెక్స్ (BMI) లో ప్రతి మనిషి ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువును సూచిస్తుంది. బరువు మనిషి శరీరం మీద ఒత్తిడి తీసుకొస్తుంది కాబట్టి ఎత్తుకు తగ్గ బరువును ప్రతి ఒక్కరూ మైంటైన్ చేయగలిగిగే మొదటి విజయం సాదించినట్టే.
అధిక బరువు అనేది ఉబకాయం కు దారి తీస్తుంది. టైప్ 2 డయాబెటిస్, హృదయ సంబంధ వ్యాధులు, రక్తపోటు, కొలెలిథియాసిస్ వంటి సమస్యలు స్త్రీలు మరియు పురుషులలో దీర్ఘకాలిక సమస్యలకు దారి తీస్తాయి. పై సమస్యలు ఒకసారి శరీరంలో ప్రవేశించాయంటే తరువాత వాటిని తగ్గించడం సాధ్యం అవదు. కాబట్టి అధిక బరువు హానికరం.
మనుషుల్లో కొందరు ఎత్తుకు తగ్గ బరువు కంటే చాలా తక్కువ అంటారు. అలాంటి వాళ్ళు బలహీనంగా తొందరగా జబ్బులకు లోనవుతుంటారు కాబట్టి ఎత్తుకు తగ్గ బరువు మనిషికి చాలా ముఖ్యం.
ప్రతిరోజూ శారీరక వ్యాయామం ఆనందించండి
ఒక వస్తువును కొన్నపుడు దాన్ని రెగులర్ గా వాడుతుంటేనే దాని పనితీరు మెరుగవుతుంది. అలాగే శరీరం కూడా ఒక పెద్ద యంత్రం లాంటిది. ప్రతీ భాగానికి తగిన పని కచ్చితంగా జరుగుతూ ఉండాలి. మనం మన శరీర భాగాలకు వ్యాగమాన్ని ఇస్తే శరీరం లోపల అవి తమ పని సమర్థవంతంగా నిర్వహిస్తాయి. ఫలితంగా శరీరం చురుగ్గా ఉండగలుగుతుంది.
వాస్తవానికి, శరీరాన్ని కాపాడుకునే విషయంలో అధిక వ్యాయామం హానికరం. అధిక వ్యాయామం మోకాలు, పండ్లు మరియు కీళ్ళను దెబ్బతీస్తుంది. ప్రతిరోజూ 30 నుండి 40 నిమిషాలు మరియు వారాంతంలో రెండు గంటలు ఈత, పరుగు, నడక వంటి వ్యాయామాలు భాగం చేసుకోవాలి. .
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరానికి మాత్రమే కాకుండా మెదడుకు కూడా మంచిది. వ్యాయామం మన మానసిక స్థితిని మెరుగుపరిచి నిరాశ, ఆందోళన మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది
వ్యాయామం మన కండరాలు మరియు ఎముకలను మంచి క్రమంలో ఉంచుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా, కండరాల పనితీరు మెరుగు పరుచుకోవచ్చు. , ఎముక సాంద్రతను మరియు బలాన్ని వృద్ధి చేసుకోవచ్చు.
సమతుల్య ఆహారం
ఆహారం మన ఆరోగ్యానికి మొదటి మెట్టు. మనము తీసుకుంటున్న ఆహారం ను బట్టే మన శరీరంలో కండరాల నిర్మాణం జరుగుతుంది.
ఆరోగ్యకరమైన జీవితానికి అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలను ఆహారమే అందిస్తుంది.
కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు కాల్షియం అధికంగా ఉండాలి. ప్రతిరోజూ రెండు పండ్లు మరియు ఐదు కూరగాయలు తీసుకోవడం ఉత్తమం. ఆహారం నుండి పూర్తి స్థాయిలో విటమిన్లు మరియు ఖనిజాలను పొందుతున్నారని నిర్ధారించుకోవడానికి పండ్లు మరియు కూరగాయలలో రంగులుగా ఉన్నవి ఎంచుకోవాలి. వీటి వల్ల ఒకో రకం రంగు కూరగాయ నుండి ఒకో ఉన్నతమైన విటమిన్ మరియు ఖనిజాలు లభ్యమవుతాయి.
డ్రై ఫ్రూట్స్, బీన్స్, మొలకలు వంటి ప్రోటీన్ లు సమృద్ధిగా ఉండే పదార్థాలను తినడానికి ప్రయత్నించండి. అలాగే తృణధాన్యాలు మరియు తెల్ల బంగాళాదుంపలను కూడా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కండర నిర్మాణానికి అవసరమయ్యే కార్బోహైడ్రేట్లు పుష్కలంగా లభ్యమవుతాయి.
మంచి సామాజిక సంబంధాలు కలిగి ఉండటం
బలమైన సామాజిక సంబంధాలు కలిగి ఉండటం ద్వారా జీవితంలో మనుషుల మధ్య దృఢమైన అనుబంధాలు ఏర్పడతాయి. ముఖ్యంగా జీవిత నిర్ణయాలు, వ్యక్తిగత విషయాలు పంచుకోవడం మరియు చర్చించుకోవడానికి స్నేహితులను సమాజం నుండే పొందుతాము. అలాగే ఆత్మీయులు, శ్రేయోభిలాషులు కూడాను. ఇంకా ముఖ్యంగా విద్య, వృత్తి విషయాల్లో సామాజిక సంబంధాలు ఎంత దృడంగా ఉంటే అంత బాగా నిలబడగలుగుతారు.
ముఖ్యంగా వృద్ధాప్యం దగ్గరైన వాళ్లలో ప్రస్తుత కాలానికి అనుగుణంగా పిల్లలు, మనుమలు వంటి వారితో అటాచ్మెంట్ తక్కువగానే ఉంటోంది. కాబట్టి సామాజిక సంబంధాలు తక్కువ ఉంటే ఒంటరిగా ఉన్నామనే భావన ఎక్కువ అవుతుంది.
చివరగా….
పైన చెప్పుకున్న నాలుగు సూత్రాలు పాటిస్తే పధికాలాల పాటు మన ఆరోగ్యం పచ్చగా ఉంటుందని వేరే చెప్పాలా