4 Awesome Tips to Make Your Feet Look Fabulous

పాదాలపై ఎందుకంత చిన్నచూపు ?

ప్రతి ఒక్కరు అందంగా ఉండాలనుకుంటారు. దీనికోసం ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకుంటుంటారు. అయితే ముఖం, జుట్టు, శరీరం, చేతులపై పెట్టే శ్రద్ధ, పాదాల దగ్గరకు వచ్చేసరికి చూపించరు. దీనికి కారణం పాదాలను ఎవరు చూస్తారులే అనే ఆలోచన కూడా కావొచ్చు. అయితే ఇక్కడ అందరూ మరిచిపోయే విషయం ఏంటంటే.. అదే పాదాల మీద గంటల కొద్ది నుంచోవడం చేస్తుంటాము. ఇలా తమ పాదాలకు సమయాన్ని కేటాయించలేక అనేక పాద సమస్యలతో స్త్రీలు, పురుషులు, ఆఖరికి పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు.

రోజువారి పనులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కనీసం కాళ్ళ గోళ్ళను శుబ్రం చేసుకొని, కట్ చేసుకోవడం వంటివైన చేసుకోవాలి.

అయితే పాదాలపై శ్రద్ధ పెట్టకపోతే  తేమ తగ్గిపోయి రఫ్ గా కనిపిస్తాయి. బ్యూటీ పార్లర్ కి వెళ్ళలేకపోయినా కనీసం ఈ క్రింద వివరించిన గృహ చిట్కాలతో మీ పాదాలను అందంగా, ఆకర్షణీయంగా ఎలా ఉంచుకోవాలో తెలుసుకుందాం.

  • రోజు రాత్రి పడుకునే ఒక గంట ముందర, ఒక బకెట్ లో గోరు వెచ్చని నీరు పోసి అందులో ఒక స్పూన్ ఉప్పు వేసి, మీ పాదాలను ఒక పది నిమిషాల పాటు ఆ నీటిలో ఉంచండి. ఆ తరువాత పొడి టవల్ తో శుభ్రం చేసుకొని.. కొబ్బరి నూనె కాని, ఆలివ్ ఆయిల్ తో కానీ, లేదా ఏదన్న క్రీం రాసుకుని మర్దన చేసుకోవాలి. ఇలా చేసాక సాక్స్ వేసుకొని పడుకోండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే.. పగుళ్ళు తగ్గి, పాదాలు మృదువుగా మారతాయి.
  • మజ్జిగలో కొద్దిగా పసుపు కలిపి రెండు పాదాలకు పట్టించాలి.. అవి ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.. ఇలా వారానికి రెండు సార్లు చేయండి. మంచి ఫలితం కనిపిస్తుంది.
  • ఒక చంచాడు శనగపిండిలో అరచంచాడు నిమ్మరసం, కొద్దిగా పసుపు కలిపి ఒక మిశ్రమంలాగా చేసుకోవాలి. దీన్ని మీ పాదాలకు రాసి ఒక అరగంట అయ్యాక చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఆ తరువాత శుభ్రంగా తుడుచుకొని సాక్స్ ధరించాలి. ఈ విధంగా వారంలో మూడు సార్లు చేసినా ప్రయోజనం కనిపిస్తుంది.
  • ఇక చివరగా.. ఒక అర చంచాడు తేనెలో రెండు స్పూన్ ల  పైనాపిల్ జ్యూస్ కలిపి మీ పాదాలకు రాసుకోవాలి. రాసిన పదినిమిషాల తరువాత.. నెమ్మదిగా మసాజ్ చేస్తే పాదాలలో రక్తప్రసరణ బాగా జరిగి, మీ పాదాలు ఆరోగ్యంగా అందంగా కనపడతాయి.

Leave a Comment

error: Content is protected !!