అందరూ ఏదైనా పనుల నిమిత్తం బయటకు వెళ్ళినప్పుడు ఎవరు ద్వారా వైరస్ సోకుతుంది అనేది చెప్పలేం.మన లోపల వైరస్ చేరిపోతూ ఉంటుంది. కొందరు ముట్టుకున్న వస్తువుల్ని మనం ముట్టుకోవడం, ఆ చేతులు కడుక్కునేలోపు ముక్కు, మూతి తాకడం అనుకోకుండా ఇలాంటివి చేస్తుంటాం. ఈ వైరస్ ముక్కు గోడలనం పట్టుకుని వైరస్ ఇన్ఫెక్షన్ మనకి లోపలికి వెళ్ళిన హాని కలిగించగ ముందే నశింపజేసే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముక్కులోకి, నోట్లోకి వెళ్ళినా వైరస్ని చంపడానికి కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ముఖ్యంగా ఆవిరి పీల్చడం అనేది చాలా మంచి ప్రయత్నం. సైంటిఫిక్ గా ఈ వైరస్ను నాశనం చేస్తుందని రుజువు చేశారు.
లోపలికిచేరి ఇబ్బంది కలిగించే వైరస్లో నీ ముక్కు ద్వారా లోపలికి వెళ్ళకుండా ఆపడానికి ఆవిరి ఎప్పుడు సహాయపడుతుంది. కరోనా వైరస్ అనేది 60 డిగ్రీల నుంచి 70 డిగ్రీల దగ్గర పూర్తిగా చచ్చిపోతుంది. అది ఆ వైరస్ లక్షణం. అది మనం బయటికి వెళ్లి వచ్చినప్పుడు ఎవరి ద్వారానైనా మన ముక్కు లేదా నోట్లోకి వెళ్ళి ఉండవచ్చు. ప్రతీసారి అలా జరగాలని లేదు. కానీ ఒకవేళ ఉంటే ఆవిరి ద్వారా దాన్ని అరికట్టవచ్చు. ఇంటికి రాగానే ఇతర పనులు చేయకుండా ఫస్ట్ ఆవిరిపట్టడం మంచిది. ఇప్పుడు ఆవిరి పెట్టే యంత్రాలు అందరిళ్ళలోనూ ఉంటున్నాయి.
లేనప్పుడు ఒక పెద్ద పాత్రలో నీళ్ళు తీసుకొని నీళ్లు బాగా మరిగించి దానితో కూడా ఆవిరి పట్టవచ్చు. దుప్పటి తలమీద మూసుకొని ఆవిరి పట్టడం మంచిది. అదే ఆవిరి పట్టుకోవడంలో మూడు రకాలుగా ఎక్కువ ఉపయోగించుకోవచ్చు. అందరిళ్ళలో కామన్గా ఉండేది పసుపు. పసుపు కూడా నీళ్లలో వేసి ఆవిరి పట్టడం వలన కూడా వైరస్ బాగా తగ్గిపోతుంది. వీలైతే స్వచ్ఛమైన పసుపు ని వాడండి. పసుపులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. బ్లాక్ ఫంగస్ అనేది ముక్కు సందుల్లో పట్టుకొని ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. ఇప్పుడు కూడా పసుపు వేసుకొని ఆవిరిపట్టడం మంచిది. ఇంక రెండోది హారతి కర్పూరం. మంచి కల్తీలేని కర్పూరం తీసుకొని అది నీళ్లలో వేసి ఆవిరి పీల్చడం చాలా మంచిది. శ్వాసనాళాలు శుభ్రపడతాయి.
గాలి నాళాలు వ్యాకోచించి వైరస్ చనిపోయి బయటికి పంపిస్తాయి. ఇవి రెండూ అందరికీ అందుబాటులోనే ఉంటాయి. ఇక మూడవది యూకలిప్టస్ ఆయిల్. అన్ని రకాలనూనెలు నీటిలో కరిగి ఆవిరికావు. కానీ యూకలిప్టస్ ఆయిల్ నీటిలో కరిగి ఆవిరవుతుంది. ఆవిరి పట్టడం వలన ముక్కులో వైరస్ చనిపోతుంది. ఆవిరి వలన వైరస్ క్లియరయి చనిపోవడానికి సహాయపడుతుంది. దీనిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇక నాలుగవది పిప్పర్మెంట్ ఆయిల్ అంటే పుదీనా ఆయిల్. ఇది చాలా ఘాటుగా ఉంటుంది. దీనిని కూడా నీటిలో వేసి ఆవిరి పట్టాలి. ఇది గొంతులో పట్టుకున్న కఫాన్ని కరిగిస్తుంది.
జలుబు, దగ్గు తగ్గించడమే కాకుండా ముక్కు, గొంతు నాలాల్లో చేరిన వైరస్ను చంపడంలో సహాయపడుతుంది. గొంతునొప్పి నివారించడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. వైరస్ సోకినవారు రోజుకు రెండు, మూడు హసార్లు తప్పకుండా ఆవిరిపట్టాలి. ఇలా ఆవిరిపడుతూ ఉంటే మామూలు వ్యక్తులు కూడా గొంతు లో చేరిన కఫం, శ్లేష్మం కరిగిపోయి జలుబు, దగ్గుకు దూరంగా ఉంటారు.