చాణిక్య నీతి గురించి మనం చాలా వింటూ ఉంటాం. కష్ట సమయాల్లో ఎలాంటి నియమాలు పాటిస్తే బయట పడతారో చాణిక్యుడు చెప్పిన చాలా విషయాలు ప్రచారంలో ఉంటాయి. ఎటువంటి విషయాలు ఎవరితో పంచుకోకూడదో తెలియక కొంతమంది చాలా ఇబ్బంది పడుతుంటారు. అనేక అవమానాల ఫాలవుతుంటారు. అలాంటి వారిని ఉద్దేశించి తత్వవేత్త, ఉపాధ్యాయుడైన చాణిక్యుడు చెప్పిన కొన్ని నియమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మనం చాలా విషయాలు బంధువులు, స్నేహితులతో పంచుకుంటూ ఉంటాం. కానీ తర్వాత పరిణామాల గురించి వాటి గురించి ఆలోచించం. కానీ కొన్ని విషయాల గురించి అందరితోనూ పెంచుకోకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆర్థిక సమస్యలు ఆర్థికంగా చితికిపోయినప్పుడు మన బందువులు అయినవారితో మన బాధలు, కష్టాలు చెప్పుకుంటాం. వారు సహాయం చేయకపోగా బయటకు వెళ్లి మన గురించి తక్కువ చేసి మాట్లాడుతుంటారు. మనల్ని హేళన చేస్తుంటారు. సహాయం పొందిన వారు కూడా ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు మనల్ని చిన్నచూపు చూస్తూ ఉంటారు.
తర్వాత వ్యక్తిగత సమస్యల గురించి కూడా అందరితో చెప్పకూడదు. గతంలో జరిగిపోయిన జ్ఞాపకాలు మన వలన జరిగిన పొరపాట్లు మన ఆరోగ్య సమస్యలు మన గురించి మన రహస్యాలు గురించి ఎవరికీ చెప్పకూడదు. అలా చెప్పడం వలన అందరూ మన గురించి చిన్నతనంగా భావిస్తారు. ఇప్పుడు స్నేహితులుగా ఉన్నవారు తర్వాత శత్రువులుగా మారవచ్చు. మన గురించి వారికి తెలిసిన రహస్యాల గురించి మనల్ని అపహాస్యం చేయవచ్చు లేదా అందరిలోనూ తక్కువ చేయవచ్చు.
తరువాత విషయం కుటుంబ సమస్యలు. భార్య భర్తల మధ్య గొడవలు, సమస్యలు ఉన్నప్పుడు వాటి గురించి బయట వారితో చెప్పకూడదు. వీటి గురించి భార్యాభర్తలిద్దరూ కూర్చొని మాట్లాడుకోవడం మంచిది. అలా మాట్లాడుకోవడం వల్ల సమస్యలు తీరుతాయి తప్ప బయట వారితో చెప్పడం వల్ల మన అనుకున్న వారిని బయట వారి ముందు తక్కువ చేస్తుంటాం.
తరువాత నాలుగో విషయం అవమానాలు. కొన్నిసార్లు మన పొరపాటు ఉన్నా లేకపోయినా మన అవమానాలపాలు అవుతుంటాం. వాటి గురించి ఎవరితోనూ చెప్పకూడదు. అలా చెప్పడం వలన మనల్ని ఓదార్చడం మంచి వాక్యాలు చెప్పడం చేస్తారు. కానీ పక్కకు వెళ్లి మన గురించి తప్పుగా మాట్లాడుతారు. రకరకాల కథలు మన గురించి ప్రచారం చేస్తారు.
అందుకే ఇలాంటి విషయాలు ఎవరితోనూ చెప్పకూడదు. మనం మనసు తేలిక అవుతుందని మనసులో విషయాలు పంచుకుంటాము. కానీ దానికి సరైన వ్యక్తితో పంచుకోవడం పోతే అనేక ఇబ్బందుల పాలవుతారు అనేది చాణిక్యుని యొక్క నీతి.