5 Best and Worst Home Remedies for Your Hemorrhoids

ఇవి మజ్జిగలో కలిపి తాగితే మొలలు, పైల్స్ వెంటనే తగ్గిపోతాయి

మొలలు లేదా ఫైల్స్ తో బాధపడేవారు చాలా ఎక్కువగా ఉన్నారు. మొలల వ్యాధి తగ్గించుకోవడం కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరిగి వేలకు వేలు ఖర్చుపెడుతున్నారు. అయినప్పటికీ ఎటువంటి ప్రయోజనం ఉండట్లేదు. మొలల వ్యాధి ఉన్నవారు కూర్చోలేక, నిలబడలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్య తగ్గించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.  ఎవరితోనూ చెప్పుకోలేక మానసికంగా కృంగిపోతారు. మొలలు 9 రకాలు ఉంటాయి. 

      వాటిలో మొదటి రకం మొలలు తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు మొలలు ఎందుకు వస్తాయి అంటే మలబద్దకం సమస్యతో బాధపడేవారికి మొలల వ్యాధి వస్తుంది. మొలల వ్యాధి ఉన్నవారు మలవిసర్జకు గంటల కొద్దీ కూర్చోవడం, మలంలో  రక్తం పడటం,  మంట, నొప్పి,  కూర్చున్నప్పుడు ముళ్ళు  మీద కూర్చున్నట్లు గా  అనిపిస్తుంది. మొలల వ్యాధిని భరించడం చాలా కష్టం. ఈ బాధ ఎవరితో చెప్పుకోలేక వాళ్లలో వాళ్లే  కుంగిపోయి మానసిక వేదన అనుభవిస్తారు. ఈ సమస్య తగ్గించుకోవడానికి ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. 

          కిచెన్ రోలు తీసుకుని కొంచెం వాము తీసుకుని చేతిలో  వేసుకొని ఒకసారి చేతితో నలిపితే పైన ఉండే దుమ్ము మొత్తం పోయి గట్టిగ ఉండే గింజలు వస్తాయి. వాటిని రోలులో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి.మిక్సీలో వేసుకున్నా పర్వాలేదు.  ఒక గ్లాసు మజ్జిగ తీసుకుని పావు చెంచా నల్ల ఉప్పు వేసుకోవాలి.తర్వాత పావు చెంచా మనం దంచి పక్కన పెట్టుకున్న వాము పొడి వేసుకోవాలి. ఈ రెండు బాగా కలిసేలా కలుపుకోవాలి.ఈ మజ్జిగను రోజుకు రెండు గ్లాసులు సమస్య తగ్గే వరకు తాగాలి. 

         క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు.  ఎన్నో రోజుల నుంచి మీరు ఇబ్బంది పడుతున్న  మొలలు సమస్యను వారం పది రోజుల్లో సులభంగా తగ్గించుకోవచ్చు. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వాము మలబద్దకం సమస్యను తగ్గించి విరోచనం సాఫీగా అయ్యేటట్లు చేస్తుంది. అలాగే నల్ల ఉప్పు కూడా మురళి వ్యాధులను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. మజ్జిగను బాగా పుల్లగా కాకుండా బాగా చప్పగా కాకుండా  ఉండే మజ్జిగను తీసుకోవాలి.

      మొలల వ్యాధితో బాధపడేవారు కారం, మసాలాలు తక్కువగా తీసుకోవాలి. అధిక ఫైబర్ ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ఈ చిట్కా  కొద్ది రోజులు ఉపయోగించే సరికి  ఫలితం కనిపిస్తుంది.

Leave a Comment

error: Content is protected !!