మారుతున్న పర్యావరణాన్ని బట్టి ప్రస్తుత కాలంలో చిన్నవారి నుంచి పెద్దవారు వరకు ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం. దీనికి పొల్యూషన్ ఒక కారణం అయితే ఆహార లోపం మరొక కారణం. కనుక ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జుట్టు రాలే సమస్య నుంచి విడుదల పొందవచ్చు. ఇలా జుట్టు రాలకుండా ఉండడానికి, జుట్టు రాలిన చోట కొత్త వెంట్రుకలు రావడానికి ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే రెమిడి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక ఆయుర్వేదిక్ రెమిడీ.
ఈ రెమిడి తయారు చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది నాలుగు కుంకుడు కాయలు. ఇది నాచురల్ షాంపూ కింద పనికి వస్తాయి. అంతేకాకుండా జుట్టు స్ట్రాంగ్ కావడానికి సహాయ పడతాయి. తర్వాత రెండు శికా కాయలను చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి. శీకాకాయలు మన జుట్టు స్మూత్ అండ్ సిల్క్ గా ఉండడానికి సహాయపడతాయి. అంతేకాకుండా జుట్టును స్ట్రాంగ్ గా చేస్తాయి. తర్వాత మనకు కావాల్సింది ఏడెనిమిది ఎండు ఉసిరి ముక్కలు. ఇది మన జుట్టుకి నలుపు రంగును ఇవ్వడానికి సహాయపడతాయి.
అంతేకాకుండా జుట్టు ఎదుగుదలకు ఉపయోగపడతాయి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ కలోంజి విత్తనాలను తీసుకోవాలి. ఇది మన జుట్టుకు నేచురల్ కలర్ ఇవ్వడానికి సహాయపడతాయి. మరియు జుట్టు ఎదుగుదల లోను, స్ట్రాంగ్ గా చేయడానికి సహాయపడతాయి. తర్వాత మనకు కావాల్సింది ఒక హాఫ్ స్పూన్ మెంతులు. ఇది మన జుట్టుకు నాచురల్ హెయిర్ కండిషనర్ లాగా సహాయపడతాయి. జుట్టును స్మూత్ అండ్ సిల్కీ చేయడానికి, కుదుళ్ళ నుంచి స్ట్రాంగ్ చేయడానికి సహాయపడతాయి.
ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో 100 గ్రాముల ఆవనూనె వేయాలి. ఆ తర్వాత స్టవ్ పై పెట్టి కొంచెం మరగనివ్వాలి. ఒకవేళ మాకు ఎండ బాగా పడుతుంది అనేవారు ఈ మిశ్రమాన్ని కంటైనర్ లో తీసుకొని మూడు రోజులు ఎండ బాగా పడేటట్టు చూసుకుంటే సరిపోతుంది. ఇలా తయారైన నూనెను మన జుట్టుకు కుదుళ్లు నుంచి చిగుళ్ళ వరకు బాగా అప్లై చేసి పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత రెండు గంటల తర్వాత తల స్నానం చేయవచ్చు. ఇబ్బంది లేదు అనుకున్న వారు అలా ఉంచుకోవచ్చు. ఇలా వారానికి రెండు సార్లు చేయాలి