ప్రతి మనిషి జీవితంలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటాడు. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ప్రతి మనిషి పాస్ అవ్వాలని అనుకుంటాడు. కానీ ఆరోగ్య విషయంలో ఆహారపు అలవాట్లలో నియమ నిబంధనలు పెట్టుకున్నట్లైతే తప్పకుండా పాస్ అవుతాడు. ఆహారం విషయంలో నియమాలు లేకపోవడం వలన కరోనా విజృంభన సమయంలో మనం ఎంత ఆరోగ్యాన్ని కోల్పోతున్నామో తెలుసా. దీనివలన రక్షణ వ్యవస్థ బలహీనం అయిపోతుంది. భవిష్యత్తులో ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
అలాంటి పరిస్థితి మనకి రాకుండా ఉండాలంటే ఈ ఆరోగ్య నియమాలు స్ట్రిక్టుగా ఫాలో అవ్వాలి. మొదటి నియమం ఏంటంటే రోజుకి 4-5 లీటర్ల నీళ్లు తాగాలి. రోజుకి 2సార్లు మలవిసర్జన చేయాలి. ఉదయం లేవగానే లీటర్పావు లేదా లీటర్నర నీళ్లు తాగితే కడుపు మొత్తం ఖాలీ ఐపోతుంది. ఒక 2గంటల తర్వాత మళ్లి లీటర్ పావు లేదా లీటర్నర నీళ్లు తాగితే పేగులు మొత్తం శుభ్రం ఐపోతాయి. రోజుకి 4-5 లీటర్ల నీళ్లు తాగడం వలన టాక్సిన్స్ మొత్తం చెమట లేదా మూత్రం రూపంలో బయటకి వచ్చేస్తాయి. ఇది పాటించినట్లయితే 15 శాతం ఆరోగ్యాన్ని సంపాదించుకున్నట్లే.
రెండవ నియమం సాయంత్రం 5:30 సమయంలో చెరుకు రసం, నారింజ రసం, బత్తాయి రసం, కమలా రసం ఏదో ఒకటి 200ml లేదా 250ml తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్న వారైతే కొబ్బరినీళ్లు తీసుకోవాలి. జ్యూస్ తీసుకోవడం వలన రక్షణ వ్యవస్థ బలపడుతుంది. శరీరానికి కావాల్సిన యాంటీ యాక్సిడెంట్స్, ప్రోటీన్స్ అందుతాయి. జ్యూస్ తాగిన 45 నిమిషాల తర్వాత బాగా ఆకలిగా ఉంటుంది. అప్పుడు నాచురల్ ఫుడ్ ని రాత్రి భోజనంగా తీసుకోవాలి.
2-3 రకాల పళ్ళు నానబెట్టిన డ్రైఫ్రూట్స్ తీసుకోవాలి. ఫ్రూట్స్, డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వలన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. రాత్రి భోజనంలో ఉడికించిన ఆహారం కంటే నాచురల్ ఫుడ్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివలన ఇంకొక 25% ఆరోగ్యాన్ని సంపాదించుకున్నట్లు. మూడవ నియమం ఉదయాన్నే ఒక గ్లాస్ వెజిటేబుల్ జ్యూస్ తాగాలి.
క్యారెట్, బీట్రూట్, సొరకాయ, పొట్లకాయ, బూడిద గుమ్మడికాయ, టమాట ఏదైనా కొంచెం తేనె కలుపుకొని 200ml లేదా 250 ml తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ జ్యూస్ లు తాగవచ్చు. తాగిన 45 నిమిషాలు లేదా గంట తర్వాత 2-3 రకాల మొలకలు, ఫ్రూట్స్ బ్రేక్ ఫాస్ట్‌గా కడుపునిండా తీసుకోవాలి. ఇక్కడ ఉడికించిన ఆహారం, ఉప్పు, నూనె వేసిన ఆహారం తినలేదు. కాబట్టి సరైన పోషకాలు అందుతాయి.
ఈ మూడు నియమాలని సోమవారం నుండి శనివారం వరకు తప్పనిసరిగా పాటించాలి. ఆదివారం ఒక్కరోజు మాత్రం 4-5 లీటర్ల నీళ్లు తాగి 2 సార్లు మల విసర్జన చేసి మీకు నచ్చిన ఆహారాన్ని తీసుకోండి. ఇలా 2-3నెలలు చేసినట్లయితే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మూడు నియమాలు పాటించడం వల్ల 65 శాతం ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నట్లే.
Nice tips for healthy living.