5 Homemade Natural Facial Cleansers For All Skin Types

మీరు ఏ సబ్బు వాడిన పర్వాలేదు దానిలో ఇది కలిపి రాస్తే ఏళ్ల తరబడి పేరుకుపోయిన మురికి, జిడ్డు పోతాయి

చాలామందికి సన్ టాన్  వలన చర్మం రంగు మారిపోతుంది.  కొందరికి మెడ కాళ్లు చేతులు నల్లగా మారిపోతాయి. తెల్లగా మార్చుకోవడానికి  ఈ క్రీం అద్భుతంగా పనిచేస్తుంది.  మీరు ప్రతిరోజు వాడే సబ్బులో ఇది కలిపి రాసినట్లయితే  ఏళ్ల తరబడి పేరుకుపోయిన జిడ్డు, మురికి పోతాయి. దీనికోసం ముందుగా ప్రతిరోజు ఏ సబ్బు  ఉపయోగిస్తున్నామో  ఆ సబ్బు తీసుకొని తురుముకోవాలి.  ఈ క్రీం 3 రోజుల  వరకు ఉంటుంది కాబట్టి  మూడు రోజులకు సరిపడా ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. 

దీనికోసం రెండు గ్లాసుల పచ్చి పాలు కాచి మీగడ తీసిన పాలు  ఉపయోగించాలి. ఒక గిన్నె తీసుకొని 100Ml   పాలు వేసి కొంచెం  వేడి అవ్వగానే స్టవ్ ఆఫ్  చేయాలి. నీళ్ల ముందుగా తరుగుకున్న సబ్బు  వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో  ఒకటిన్నర చెంచా కార్న్  ఫ్లోర్  వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. దీనిలో పావుచెంచా పచ్చి పసుపు లేదా ఛాయ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. పసుపు పడదు అనుకున్నవారు కుంకుమ  పువ్వు వేసుకోవచ్చు. తర్వాత దీనిలో ఒక చెంచా గ్లిజరిన్ వేసుకోవాలి.

గ్లిజరిన్  చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడంలో సహాయపడుతుంది.  సబ్బు చర్మంను   మాయిశ్చరైజ్ చేయడానికి కావలసినవి ఉంటాయి. పాలు  కూడా   చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి.   గ్లిజరిన్ కావాలి అనుకున్న వాళ్లు వేసుకోవచ్చు లేదా వేసుకోకుండా కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి క్రీం కంటిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.   ఈ క్రీం స్నానం చేసేటప్పుడు సబ్బు అప్లై చేసుకున్నట్లుగా అప్లై చేసుకొని నీళ్లు చిలకరించి   రుద్దుకోవాలి. ఇలా చేసినట్లయితే సంవత్సరాల తరబడి పేరుకుపోయిన జిడ్డు మురికి మొత్తం పోతుంది.

సన్ టాన్  వలన రంగు మారిన చర్మం కూడా నార్మల్ రంగు లోకి వచ్చేస్తుంది. ఈ  క్రీమ్ లో వాడినవి  అన్ని నేచురల్ ఇంగ్రిడియంట్స్ కాబట్టి   ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ క్రీం  కాళ్లు చేతులు ముఖం ఎక్కడైనా సరే ఉపయోగించవచ్చు.  ఎటువంటి నష్టం ఉండదు.  ఈ  క్రీమ్ ఒకసారి అప్లై చేసేసరికి మీ చర్మంపై ఉండే టాన్  మొత్తం పోతుంది. మీ చర్మం తెల్లగా, కాంతివంతంగా తయారవుతుంది. సన్ టాన్ పోగొట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయిన వారు ఒకసారి ఈ చిట్కా ట్రై చేయండి. 

Leave a Comment

error: Content is protected !!