శరీరంలో గ్యాస్, ఎసిడిటీ, యూరిక్ యాసిడ్ ఎక్కువై పోతుంటే మలబద్ధకం, డయాబెటిస్, గుండె జబ్బులతో బాధపడుతున్న వారు వాటిని తగ్గించడానికి ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటించడం వలన వాటి నుండి ఉపశమనం పొందవచ్చు. దానికోసం కావలసిన పదార్థాలు కలోంజి విత్తనాలు. కలోంజి విత్తనాలు జీర్ణ వ్యవస్థ బాగా పనిచేసేందుకు తోడ్పడతాయి. ఆహారం బాగా జీర్ణమయ్యేందుకు మలబద్ధకం ఏర్పడకుండా ఉండేందుకు గ్యాస్ సమస్య రాకుండా అడ్డుకునేందుకు చాలా బాగా పనిచేస్తాయి.
అంతేకాకుండా కలోంజి విత్తనాలు శరీరంలో అనేక రకాల నొప్పులను తగ్గించడంలో కూడా ప్రభావంతంగా పనిచేస్తాయి. వీటితోపాటు మనకు కావలసిన పదార్థం వాము. వాము తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి, శరీరంలో ఏర్పడే గ్యాస్ ను బయటకు పంపడానికి చాలా బాగా పనిచేస్తుంది. మన చిన్నతనం నుండి అజీర్తితో బాధపడేవారికి వామును పొడి రూపంలో, కషాయంగా ఇస్తూ ఉంటారు. వాము తిన్న ఆహారం అరిగేందుకు సహాయపడుతుంది. అజీర్తి, గ్యాస్ సమస్యలు ఉన్నవారు మనం తినే ఆహారంలో వీటిని భాగంగా తీసుకోవాలి. ఒకవేళ రాత్రి పూట చపాతీ తింటూ ఉంటే ఒక అర స్పూన్ కలోంజి విత్తనాలు, అర స్పూన్ వాము వేసి కలపాలి.
ఇలా మనకు తెలియకుండానే ఆహారం ద్వారా కడుపులో చేరి ఆహారాన్ని బాగా జీర్ణం చేసి ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తుంది. డయాబెటిస్, గుండె వ్యాధితో బాధ పడేవారు వాటిని తగ్గించుకోవడానికి ఒక గ్లాస్ నీటిని స్టౌపై పెట్టి దానిలో ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ కలోంజీ విత్తనాలు వేయాలి. ఇప్పుడు ఈ నీటిని అర గ్లాసు అయ్యేంత వరకు మరిగించి తరువాత ఈ నీటిని వడకట్టి ఒక స్పూన్ బెల్లం లేదా తేనెతో తీసుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు బెల్లం తీసుకోకుండా ఈ చిట్కా పాటిస్తూ ఉండాలి. ఎక్కువగా శరీరంలో వేడి చేసే వారు ఒక స్పూన్ ముల్లేటీ పౌడర్ వేసుకోవాలి.
ఈ ముల్లేటి పౌడర్ ఆయుర్వేదిక్ షాప్ లో ఆన్లైన్ షాప్ లో కూడా అందుబాటులో ఉంటుంది. ముల్లేటి పౌడర్కు శరీరంలో చలువచేసే గుణం అధికంగా ఉంటుంది. ఈ మూడింటినీ కలిపి తీసుకోవడం వలన శరీరంలో కొవ్వు కరిగించి అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది. ట్రాన్స్ ఫ్యాట్ పెరుగుదలను ఆపుతుంది. గుండె వ్యాధులు, రక్త పోటు సమస్యకు ఉపశమనం కలిగిస్తుంది. డయాబెటిస్ను అదుపులో ఉంచడానికి ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది.