మన శరీరంలో అనేక రకాల రుగ్మతలు రాకుండా మనం శరీరం గురించి శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. దాని కోసం మనం అప్పుడప్పుడు కొన్ని మంచి అలవాట్లను ఫాలో అవ్వడం వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇప్పుడు చెపఱపబోయే చిట్కాతో శరీరంలోని అవయవాలు ఆరోగ్యంగా పనిచేస్తాయి. దాని కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు కూడా మనకు ఇంట్లోనే అందుబాటులో ఉంటాయి. కాకపోతే వాటి గురించి సరైన అవగాహన లేక మనం వాటిని అశ్రద్ధ చేస్తూ ఉంటాం. దీనికోసం మనకు కావలసిన ముఖ్యమైన పదార్థం బిర్యానీ ఆకు. మనం బిర్యానీ నుండి ఈ ఆకులను తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాం.
ఆరోగ్య రక్షణకు వ్యాధులు దరిచేరకుండా కాపాడడానికి ఈ ఆకులు చాలా బాగా పనిచేస్తాయి. 5 బిర్యానీ ఆకులు తీసుకొని శుభ్రంగా కడిగి రెండు గ్లాసుల నీటిలో వేసి మరిగించాలి. ఒక గ్లాసు నీరు అయ్యేంతవరకు మరిగించి తర్వాత నీటిని వడకట్టాలి. ఈ నీటిని కనీసం 15 రోజుల పాటు తీసుకోవడం వలన శరీరంలో అనేక రకాల రుగ్మతలను తగ్గించుకోవచ్చు. బిర్యానీ ఆకులు విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, కాల్షియం మరియు మెగ్నీషియం యొక్క గొప్ప మూలం. మైగ్రేన్ చికిత్సలో ఇవి ఉపయోగపడతాయని నిరూపించబడింది. బే లీఫ్‌లో ఎంజైమ్‌లు ఉన్నాయి, ఇవి ప్రోటీన్‌లను విచ్ఛిన్నం చేయడానికి మరియు ఆహారాన్ని వేగంగా జీర్ణం చేయడానికి సహాయపడతాయి, అజీర్తిని తగ్గించడానికి సహాయపడతాయి.
తర్వాత టిప్ కోసం ఐదు బిర్యాని ఆకులను తీసుకుని మిక్సీలో మెత్తగా పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని జల్లించి దాని నుండి వచ్చిన మెత్తని పొడిని ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. ఒక కప్పు పెరుగులో పావు స్పూన్ బిర్యానీ ఆకు పొడిని కలిపి తినడం లేదా ఒక గ్లాసు మజ్జిగలో పొడిని కలిపి తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థను మెరుగు పరచడం, గట్ ఆరోగ్యాన్ని కాపాడడం, గ్యాస్ను బయటకు పంపడం వంటి అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చు. ఈ టిప్స్ లో ఏదో ఒక దానిని రోజూ పాటించడం వలన మలబద్ధకం వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. నీటిని ఇలా తాగలేని వారు ఒక స్పూన్ తేనె కలిపి తాగవచ్చు.