ఇండియా ఒలంపిక్స్ లో 1900వ సంవత్సరంలో చేరింది. అప్పటి నుండి ఇప్పటి టోక్యో ఒలంపిక్స్ వరకు 121 ఒలంపిక్స్ క్రీడల్లో కేవలం 30 మాత్రమే పతకాలను సాధించింది. ఆ 30లో గ్రూప్ టీమైన హాకీని మినహాయిస్తే మనకి వచ్చిన బంగారు పతకాలు కేవలం ఒకే ఒకటి. మన పొరుగు దేశమైన చైనాకి లండన్ ఒలింపిక్స్ లో 91 పతకాలు వచ్చాయి.
ఆ 91లో 38 గోల్డ్ పతకాలే ఉన్నాయి. చాలా పేద దేశమైన కెన్యా గెలిచిన పతకాలు 103. అందులో గోల్డ్ 31 వరకు ఉన్నాయి. అంటే ఇండియా గెలిచిన పథకాల కంటే కెన్యా గెలిచినవి మూడు రెట్లు అధికం. కేవలం ఐదు కోట్ల జనాభా కలిగిన కెన్యా నూట మూడు పతకాలు గెలిస్తే దాదాపు 130 కోట్ల జనాభా కలిగిన ఇండియా 30 పథకాల కే పరిమితం కావడానికి కారణమేంటి? ప్రతి నాలుగు సంవత్సరాలకు ఇండియాలో మెదిలే ప్రశ్న ఇది.
ప్రశ్న వచ్చిన ప్రతిసారి స్కూల్స్లో ఆటలకి సమయం ఉండడం లేదని, ప్రభుత్వం కూడా క్రికెట్ మీద అ వెచ్చించిన ధనం మిగతా క్రీడల మీద పెట్టడం లేదని అంటారు. అందుకే ఒలంపిక్స్లో ఇండియా కి పథకాలు రావడం లేదని ప్రజలు అనుకుంటూ ఉంటారు. అసలు ఈ వాదనలో నిజానిజాలు ఎంత? కేవలం ముప్పై పథకాలు కే పరిమితం అవ్వడానికి కారణం ఏంటి?
ఇతర దేశాలలాగానే అధికంగా పథకాలు సాధించాలంటే ఏం చేయాలి. ఇప్పుడు తెలుసుకుందాం. అసలు పథకాలు రాకపోవడానికి కారణాలు
క్రీడల గురించి అవగాహన లేకపోవడం. క్రికెట్, ఫుట్బాల్ లాంటి ఆటలు ఆడి ఉండటం లేదంటే ఇంటిదగ్గర గోలీలు, ఏడుపెంకులాట లు ఆట ఆడే ఉంటారు. కానీ ఒలంపిక్స్ లో ఆడే చాలా ఆటల గురించి వాటి నియమాలు గురించి కూడా మనకు అవగాహన లేదు.
డబ్బు లేకపోవడం: మన దేశంలో సంపద కేవలం 10 శాతం మంది దగ్గర మాత్రమే ఉంది కనుక మన దేశంలో చాలా తక్కువ మంది మాత్రమే ఈ ఖరీదైన ఆటలకు శిక్షణ తీసుకోగలుగుతారు కెన్యా దేశస్థులకు డబ్బు లేకపోయినా వారి శరీర దారుఢ్యం ఫిట్నెస్ పురాతన కాలం నుండి వస్తుంది.
మన దేశంలో ఉండే రాజకీయాలు అవినీతి: వీటి వలన చాలామంది ఒలంపిక్స్ వరకూ వెళ్ళ లేకపోతారు.
లింగవివక్ష: మనదేశంలో లింగవివక్ష కూడా ఒలంపిక్స్లో పథకాలు గెలవక పోవడానికి కారణం అవుతుంది. మన దేశం దీనికి వ్యతిరేకంగా ఉంటుంది ఇప్పటికి అమ్మాయిలను బయటకు పంపించడానికి భయపడుతుంటారు.
వీటన్నింటికీ గవర్నమెంట్ నిందిస్తూ కూర్చుంటామా. గవర్నమెంట్ దగ్గర సరైన టాయిలెట్స్ కట్టడానికి కూడా డబ్బు లేనప్పుడు ఇలాంటి ఖరీదైన శిక్షణ ఎలా ఇవ్వబడుతుంది. వీటన్నింటినీ దాటి ఇండియా కూడా పథకాలు గెలవాలంటే ప్రజల దగ్గర కేవలం రెండే ఆప్షన్స్ ఉన్నాయి అవి ఒకటి క్రికెట్ చూడడానికి వెచ్చించే సమయంలో కొంత మిగతా క్రీడలు కూడా పెట్టడం మంచిది. దానివలన వాటిని చూసే వాళ్ళు పెరిగేకొద్దీ స్పాన్సర్లు కూడా పెరుగుతారు.
దానితో ఆటపై ప్రభుత్వానికి కూడా ఆసక్తి పెరుగుతుంది చైనాలో అన్ని క్రీడలను సమానంగా చూడటం వల్లే అక్కడ అన్ని ఆటలలో పథకాలు గెలుస్తున్నారు. రెండవది మనం చిన్నప్పటి నుండి గోలీలు, కర్రబిళ్ళ మాత్రమే ఆడుకున్నాం కనుక ఒలంపిక్స్ వెళ్లే అవకాశం లేదని సరిపెట్టుకొని ఊరుకోవడం. ఇకపై పిల్లలను ఒలంపిక్ క్రీడలకు తయారు చేయడం మన బాధ్యత అనుకొని నాలుగు సంవత్సరాలకు ఓసారి బాధపడడం మానేస్తే సరిపోతుంది.