5 Simple Ways to Boost Your Immunity Naturally

ఇలా చేస్తే మీ శరీరంలో రోగనిరోధక శక్తి సులభంగా పెరుగుతుంది.

మన శరీరం అనారోగ్యానికి గురయ్యిందంటే కారణం శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉందని అర్థం. తీసుకునే ఆహారంలో అశ్రద్ధ, ఎలాంటి ఆహారం తీసుకోవాలనే అవగాహన లేకపోవడం వంటి కారణాల వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనం అవుతుంటుంది.  అయితే కొన్ని నియమాలు పాటిస్తే రోగనిరోధక శక్తి పెంచుకోవడం సులువే అవేమిటో చూద్దాం మరి.

◆  శరీరానికి అనారోగ్యాన్ని కలిగించే ప్రధాన కారణం మలబద్దకం. జీర్ణక్రియ సరిగా లేకపోవడం వల్ల చాలా వరకు జబ్బులు వస్తాయి. కాబట్టి మలబద్దకాన్ని నివారించుకోవడానికి సులువుగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి.  

◆ తోటకూర, మెంతి కూర, పాలకూర మొదలైన ఆకుకూరలు. బీర, పొట్ల, దోస, ముల్లంగి, టమాటా మొదలగు కూరగాయలు, ద్రాక్ష, ఆల్ బకరా వంటి పండ్లు, పొట్టు తీయని ధాన్యం, ముడి బియ్యం వంటివి తీసుకోవడం ఉత్తమం.

◆ బలహీనంగా ఉన్నవారు నారింజ, ఆపిల్ మొదలగు పండ్ల రసాలు తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. ఆహారం తీసుకునేటప్పుడు అధిక మోతాదులో ఒకసారి కాకుండా, కొంచం కొంచం గా భాగాలుగా చేసి తీసుకోవడం మంచిది. తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి. 

◆ కాల్షియం, ఐరన్ విటమిన్లు ఎక్కువగా ఉన్న ఆహారం, మాంసకృత్తులు తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే బలము, దేహపుష్టి కలుగుతుంది. 

◆ ఊబకాయం లేదా అధిక బరువుతో ఇబ్బంది పడేవారు తీపి పదార్థాలకు, కొవ్వు పదార్థాలకు, పిండి పదార్థాలకు వీలైనంత దూరంలో ఉండి, ఆకు కూరలు, పండ్లు, మజ్జిగ ఆహారంగా తీసుకోవాలి. వ్యాయామం, నడక, చెమట పట్టేలా శారీరక శ్రమ చేయాలి. దీనివల్ల శరీరంలో మలినాలు తొలగిపోతాయి.

◆ జీర్ణశయములో పులుపు ఎక్కువైనపుడు ఆమ్ల పిత్తము సమస్య వస్తుంది. బోజనం చేసిన కొద్దిసేపటి తరువాత నొప్పి, మంట కలుగుతాయి. దీనిని తగ్గించుకోవాలి అంటే మసాలాలు జొప్పించి తయారు చేసిన ఆహారం, పుల్లని పండ్లు, అతి వేడి పదార్థాలు, చల్లని పదార్థాలు, ధూమపానం, మద్యపానం,  కాఫీ మొదలైనవి మానేయడం మంచిది. ఈ నియమాలు అనుసరిస్తూ తగిన ఆహారం తీసుకుంటే తొందరగా సమస్య తగ్గుముఖం పడుతుంది.

◆ కలరా, వాంతులు, అతిసారం, గ్రహాణి, కడుపు ఉబ్బరం మొదలైన వ్యాధులు కలిగినపుడు శరీరంలో మలినాలు పేరుకుపోతుంటాయి. ఇలాంటి సమయాల్లో ఉపవాసం చేయడం చాలా ఉత్తమం. దీనివల్ల వ్యాధికారక క్రిములు, సూక్ష్మజీవులు విచ్చిన్నమవుతాయి. 

చివరగా…..

పైన చెప్పుకున్న నియమాలతో పాటు రోగనిరోధక శక్తి పెంపొందడానికి యోగ, ధాన్యం, వ్యాయామం వీటితో పాటు కాలానికి అనుగుణంగా దొరికే పండ్లు తీసుకోవడం. ముఖ్యంగా తాజా ఆహారం తీసుకోవడం, వీలైనంత వరకు బయటి ఆహారానికి దూరంగా ఉండటం ఉత్తమం.

Leave a Comment

error: Content is protected !!