ఈరోజుల్లో ఊబకాయం, భారీ ఊబకాయం లేదా అధిక బరువు సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతు ఉన్నాయి. కొవ్వు కణాల్లో కొవ్వు పెరిగిపోవడం అనేది జరగడం వలన శరీరం సైజు పెరిగిపోతూ ఉంటుంది. గాలి కొట్టే కొలది టైర్ సైజు పెరిగినట్టే కొవ్వు కణాల్లో కొవ్వు పెరిగే కొద్దీ మన సైజు పెరుగుతూ ఉంటుంది. ఇలా పేర్కొన్న కొవ్వు కరగాలి అన్న లేదా తోలగలి అన్న అసలు కొవ్వు కరిగి ఏ రూపంలో బయటకు పోతుంది అని అందరికీ ఒక డౌట్ ఉంటుంది. రెండు రుపాల్లో కొవ్వు తగ్గే అవకాశం ఉంటుంది.
అందులో ఒకటి సర్జరీ చేసి కొవ్వు కణల్లో ఉన్న కొవ్వు మొత్తం బయటికి అన్నా తీసివేయాలి. ఇది ఒక పద్ధతి. మామూలుగా పొట్ట భాగాలలో, తోడ భాగాలలో ఎక్కడైనా కొవ్వు ఉంటే లైపో ద్వారా డ్రిల్ చేసి ఏదో కవ్వం కింద తిప్పి అంటే పెరుగులో నుంచి వెన్న తీసిన మాదిరిగా కొవ్వును కూడా అదే విధంగా లైపోసెక్షన్ ద్వారా అదేవిధంగా తీస్తారు. ఇది ఒక పద్ధతి. ఇలా కాకుండా నేచురల్ పద్ధతిలో కొవ్వు తగ్గాలి అన్నా లేదా కరగాలి అన్నా ఎక్ససైజ్ చేయడం అనగా శారీరక శ్రమ పెట్టడం ఒక్కటే మార్గం. మన జీవన శైలి బాగుంది అంటే శారీరక శ్రమ ద్వారా, పని ద్వారా లేక వ్యాయామాల ద్వారా అన్నా కొవ్వు కరుగుతుంది.
ఈ కొవ్వు కరిగినప్పుడు ఏ రూపంలో బయటికి పోతుంది అంటే మన శరీరంలో శ్రమ చేసిన, వ్యాయామాలు చేసిన పనిచేసినప్పుడు కూడా శక్తి ఖర్చవుతుంది. ఈ కొవ్వు శక్తి కింద మండుతుంది. మన శరీరం లోపల కొవ్వు కరిగినప్పుడు వేడి ఉత్పత్తి అయ్యి ఫ్యాట్ వ్యర్ధాల రూపంలో ఏ విధంగా బయటికి పోతుంది అంటే 84% కార్బన్ డయాక్సైడ్ రూపంలో బయటకు పోతుంది. మనం వదిలే వాయువులో 84% ఫ్యాట్ మండింపబడి బయటికి పోతుంది. 16% వాటర్ గా మారి యూరిన్ ద్వారా బయటికి పోతుంది.
అందువల్లే ఫ్యాట్ కొవ్వు కరిగినప్పుడు, మీరు బరువు తగ్గినప్పుడు కొవ్వు ఈ విధంగా బయటికి పోతుంది. అటు శక్తి వినియోగం జరుగుతుంది. అందువలన అన్నిటికంటే కొవ్వును తగ్గించుకొనే ప్రమాదం లేని పద్ధతి వ్యాయామాలు, కష్టపడి పనిచేయడం. ఇలాంటి అవగాహన మనం కల్పించుకుంటే రోజు వ్యాయామాలు చేస్తాం. కొవ్వును తోడించుకోవడం మానేసి కరిగించుకోవడమే సరైన పరిష్కారం…….