5 Things Your Nails Can Say About Your Health

గోర్లు చెప్పే గమ్మత్తైన అనారోగ్య సమస్యలు!! అవేమిటో మీరే చూడండి.

ప్రతి మనిషికి తనకున్న అనారోగ్యం చాలావరకు డాక్టర్ దగ్గరకు వెళ్లి వివిధ రకాల టెస్ట్ లు చేయించుకున్న తరువాత  బయటపడుతూ ఉంటుంది. అయితే చాలామందికి తెలియని విషయం తమ గోర్లు ఉన్న తీరును బట్టి తమకున్న అనారోగ్యాన్ని ఇట్టే తెలుసుకోవచ్చని. అయితే ఎలా తెలుసుకోవడం అన్న సందేహం అక్కర్లేదు. గోర్లు ఉండే తీరును బట్టి మన శరీరాన్ని ఎలాంటి అనారోగ్య సమస్య చుట్టుముట్టిందో  మీరే చదివి తెలుసుకోండి. తరువాత జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 

  “పెళుసైన, బలహీనమైన, మరియు పొట్టు లేచినట్టు ఉండే గోర్లు సాదారణంగా చాలామందిలో కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా వారి వారి అనారోగ్య సమస్యలు సంకేతమే. 

 ఆరోగ్యకరమైన గోర్లు రంగు పాలిపోకుండా మృదువుగా ఉంటాయి, కానీ గొర్ల ఆకృతి మరియు రంగుతో ఏదైనా తేడాగా ఉంటే మాత్రం అనారోగ్యానికి అడ్రెస్ ఇచ్చేసినట్టే.  

పెళుసు గోర్లు

 కఠినమైన గోర్లు కాస్తా పెళుసు బారి సులభంగా పగుళ్లు ఏర్పడతాయి.  ఇవి సాధారణంగా స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తాయి.  ఇలా గోర్లు పెళుసు బారిన సమస్యను ఒనికోస్కిజియా అని పిలుస్తారు, పెళుసైన గోర్లు సాధారణంగా తొందరగా విరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. దీన్ని అధిగమించడానికి  ఆల్ఫా-హైడ్రాక్సీ ఆమ్లాలు లేదా లానోలిన్ కలిగి ఉన్న లోషన్లను గొర్ల మీద వేసి మెల్లిగా మసాజ్ చేయాలి. అయితే పెళుసు గోర్లు ఉన్నవారికి  ఐరన్ లోపంతో హైపోథైరాయిడిజం వంటి సమస్యలు ఉండవచ్చు.

బలహీనమైన గోర్లు

 బలహీనంగా ఉన్న గోర్లు సులభంగా విరిగిపోతాయి. గొర్లతో బలాన్ని ఉపయోగించి ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు తొందరగా వంగిపోవడం జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం అధికంగా తడి తగులుతూ ఉండటం లేదా రసాయనాలు తగలడం వల్ల అలా జరగవచ్చు. అంతే కాదు సౌందర్య స్పృహలో భాగంగా ఎక్కువగా మెనిక్యూర్ చేయించుకోవడం మొదలైన వాటి వల్ల గోర్లు బలహీనమవ్వడం, పొడిబారడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళల్లో వంటగది, బాత్రూమ్ లు మొదలైనవి శుభ్రం చేయడం వల్ల కూడా గోర్లు బలహీనం అవుతూ ఉంటాయి.    బలహీనమైన గోర్లకు బి విటమిన్లు, కాల్షియం, ఐరన్ లేదా కొవ్వు ఆమ్లాల లోపంతో ఎక్కువగా సంబంధం కలిగి ఉంటాయి.  మల్టీవిటమిన్ తీసుకోవడం ప్రారంభించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

 గోరు మీద పొర పొట్టు లాగా రావడం.

 ఇది గోరుకు బయట గాయం వల్ల జరుగుతూ ఉంటాయి.   గోరును ఏదైనా వంటింట్లో డబ్బాల మూతలు తీయడానికి, లేక పండ్ల తొక్కలు తీయడానికి ఉపయోగించినపుడు ఒత్తిడికి గురయ్యి చర్మం లోపలివరకు దెబ్బతిని గోరు పై భాగం పొట్టులాగా రావడానికి కారణం అవుతుంది.  అయితే చాలామందిలో ఐరన్ లోపం వల్ల ఇలా గోరు పైన పొర పొట్టులాగా రావడం జరుగుతూ ఉంటుంది. ఐరన్ లోపం అయితే కాయధాన్యాలు, ఎర్ర మాంసం, బలవర్థకమైన తృణధాన్యాలు లేదా కాల్చిన బంగాళాదుంప తొక్కలతో  ఆహారంలో ఐరన్ జోడించుకోవాలి. బయోటిన్ కూడా తీసుకోవచ్చు.  

 చీలికలు

 వేలుగోళ్లపై చిన్న క్షితిజ సమాంతర లేదా నిలువు తరంగాల లాగా కనిపించే చీలికలను ఎప్పుడైనా గమనించారా?  గోర్ల రంగులో మార్పులు వంటి ఇతర లక్షణాలతో లేకపోతే ఇవి పెద్ద సమస్య కాదు కాని  బ్యూస్ లైన్స్ అని  పిలువబడే క్షితిజ సమాంతర చీలికలు మరింత తీవ్రమైన లక్షణానికి సంకేతం.  ప్రస్తుతం కరోనా సోకిన వాళ్లలో కొందరిలో ఇవి కనబడుతున్నాయి కూడా. ఐరన్  లోపం రక్తహీనతకు సూచిస్థాయి. అయితే క్షితిజ సమాంతర రేఖలు మూత్రపిండాల వ్యాధి వంటి అంతర్లీన పరిస్థితిని సూచిస్థాయి.

గోర్లు పసుపు రంగు మారడం

 పసుపు రంగు గోర్లు సాధారణంగా చాలామందిలో కనబడుతూ ఉంటాయి. కొందరిలో ఇవి ఎక్కువగా నైల్ పాలిష్ వంటివి వాడటం వల్ల అలా కనబడుతూ ఉంటాయి. అయితే మరికొందరిలో అలాంటివి ఏమి లేకపోయినా పసుపు రంగులోకి మారి పాలిపోయినట్టు  ఉంటాయి. ఇవి చాలా ప్రమాదకరమైన అనారోగ్యానికి సంకేతం కావచ్చు. ముఖ్యంగా మల్టివిటమిన్ లోపం వల్ల ఇలా పసుపు రంగు గోర్లు ఏర్పడతాయి.  టీ ట్రీ ఆయిల్ లేదా విటమిన్ ఇ, బాదం నూనె వంటివాటితో మర్దనా చేస్తూ ఉండాలి. అలాగే మల్టివిటమిన్ శరీరానికి తప్పనిసరిగా అందించాలి.  

చివరగా…

పైన చెప్పుకున్నవే కాకుండా గొర్ల మీద నల్లని గీతలు గోరు లోపలి చర్మం గాయానికి గురయినట్టు, తెల్లని మచ్చలు జింక్ లోపాన్ని సూచించడం మొదలైనవి గోర్లు మనకు ఇచ్చే పెద్ద సంకేతాలు. మరి అన్నిటినీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని సమస్యలను అధిగమించండి.

Leave a Comment

error: Content is protected !!