5 ways to make natural energy drink at home

ఇలా చేసి త్రాగండి మోకాళ్ళ నొప్పులు రక్తహీనత కళ్లద్దాలు దూరం

శరీరంలో రక్త హీనత, మోకాళ్ళ నొప్పులకు ఐరన్ క్యాల్షియం లోపం ఏర్పడటం కారణం. దీనిని నివారించడానికి ప్రతి రోజు ఒక గ్లాస్ ఈ డ్రింక్ తాగారంటే జీవితంలో మోకాళ్ళ నొప్పులు, రక్తహీనత, బలహీనత వంటి సమస్యలు మీ దరిచేరవు. దాని కోసం మనం తీసుకోవాల్సినవి ఎండు ఖర్జూరాలు. ఎండు ఖర్జూరాలు ఐరన్తో పుష్కలంగా ఉంటాయి. ఎండు ఖర్జూరంలో కూడా పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి.  ఈ సమ్మేళనాలు మెరుగైన జీర్ణక్రియ, మధుమేహం నిర్వహణ మరియు క్యాన్సర్ నివారణ వంటి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.  అనేక ఎండిన పండ్లలో అధిక పాలీఫెనాల్ కంటెంట్ ఉన్నప్పటికీ, ఎండిన ఖర్జూరాలు అధికంగా లభిస్తుంది.

 ఇవి ఎండి ఉన్నప్పుడు చాలా గట్టిగా ఉంటాయి. అందుకే వీటిని ఐదారు గంటల పాటు నానబెట్టాలి లేదా రాత్రంతా నానబెడితే ఇంకా మంచిది. ఇలా నానబెట్టిన ఎండు ఖర్జూరాలలోని విత్తనాలను తీసేసి చిన్న ముక్కలుగా కోసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ పేస్ట్ ను పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొన్ని బాదం పప్పులు, జీడిపప్పులను తీసుకోవాలి. వీటిని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ముక్కలుగా తినడం ఇష్టం లేనివారు పౌడర్ చేసి పెట్టుకోవచ్చు. తరువాత స్టవ్పై ఒక గ్లాసు వెన్న లేని పాలు వేసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ ఖర్జూరం పేస్ట్ వేసి పాలను బాగా మరిగించాలి. 

పాలు మరిగిన తరువాత మాత్రమే ఖర్జూరం బెస్ట్ వేయండి లేదంటే పాలు విరిగిపోయే ప్రమాదం ఉంది తర్వాత కట్ చేసి పెట్టుకొన్న బాదం, జీడిపప్పు ముక్కలు కూడా వేసి పాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు కావాలి అంటే పటిక లేదా బెల్లం పౌడర్ వేసుకోవచ్చు. బెల్లం స్టౌ ఆపేసిన తర్వాత మాత్రమే వేయాలి. లేదంటే పాలు విరిగి పోతాయి. ఈ డ్రింక్ ను ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల బాగా జీర్ణం అవుతాయి మరియు శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. రాత్రిపూట జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. కనుక ఈ డ్రింక్ తాగడం వలన జీర్ణ సంబంధ సమస్యలు రావచ్చు. ఉదయాన్నే తాగడం మంచిది.

Leave a Comment

error: Content is protected !!